
రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఈరోజు (సోమవారం) ప్రకటించే అవకాశాలున్నాయి. మీడియాకు తెలిసిన వివరాలప్రకారం సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) మరోమారు జయ బచ్చన్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరో ఇద్దరి పేర్లను ఈరోజు వెల్లడించనున్నారు.
సమాజ్‌వాదీపార్టీ కార్యాలయంలో జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో రాజ్యసభకు పంపే అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.