గత కొద్ది రోజుల నుంచి బిట్‌కాయిన్ తీవ్ర అస్థిరతను చవిచూసింది. బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌కు చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిట్‌కాయిన్‌లో అనిశ్చితి నెలకొంది. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది. తాజాగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ సంచలన ప్రకటన చేశాడు.
చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
ఈ ఏడాది చివర్లో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్ల (సుమారు రూ. 73.65 లక్షలు)కు చేరుకుంటుందని తన ట్విట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది ప్రజలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు. బిట్‌కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను మూలంగా చేసుకొని బిట్‌కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు.
2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్‌కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తోంది.
Can Bitcoin Reach $100,000 in 2021? Five Charts Show Potential - Past #Bitcoin trading trends and the crypto's declining supply vs. mainstream adoption suggest a significant advance in 2021, potentially to $100,000, we believe. pic.twitter.com/0tH7PS7QEI
— Mike McGlone (@mikemcglone11) September 16, 2021
Comments
Please login to add a commentAdd a comment