గుట్కా విక్రయాలపై దాడులు
తాడేపల్లిగూడెం రూరల్ : గుట్కా, ఖైనీ ప్యాకెట్లు విక్రయిస్తున్న షాపులపై పట్టణ పోలీసులు దాడి చేశారు. సుమారు రూ.2.10 లక్షలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్ : గుట్కా, ఖైనీ ప్యాకెట్లు విక్రయిస్తున్న షాపులపై పట్టణ పోలీసులు దాడి చేశారు. సుమారు రూ.2.10 లక్షలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా, ఖైనీ విక్రయ కేంద్రాలపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో కర్రి కనికిరెడ్డి (భాగ్యలక్షి్మపేట), దువ్వి నాగేంద్ర (వీకర్స్ కాలనీ), బెజవాడ ప్రసాద్ (మసీదు సెంటర్), కడియాల రాధాకృష్ణ (రామారావుపేట), కోడూరి ప్రభాకర్ సతీష్ (సీతారాంపేట) దుకాణాలపై పట్టణ ఎస్‌ఐ ఐ.వీర్రాజు, సిబ్బందితో దాడి చేశారన్నారు. ఆయా దుకాణాల నుంచి గుట్కా, మీరజ్ ఖైనీ, రాజాఖైనీ, ఎంసీ ఖైనీ, ఎం అండ్ ఎం ఖైనీ కంపెనీలకు చెందిన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లోని ఆర్.భద్రం అండ్ స న్స్
యజమాని రాతంశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ భద్రం, అప్పన అప్పారావు వద్ద నుంచి గుట్కాను కొనుగోలు చేసి పట్టణంలో విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ మూర్తి పేర్కొన్నారు. ఎస్‌ఐ ఐ.వీర్రాజు, ఏఎస్సై అప్పారావు, రైటర్లు జి.సుబ్బారావు, ఎ.సత్యనారాయణరాజు ఉన్నారు.