Before independence
-
స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర
బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!) భారతీయ బ్యాంకింగ్ చరిత్ర వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి 1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ. 600లకు పైగా బ్యాంకులు స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది. మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి. -
బ్రిటీష్‌ను బెంబేలెత్తించిన... మైసూరు రాకెట్లు...!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ దగ్గరలోనే ఓ గ్రామంలోని పాడుపడిన బావి నుంచి ఇటీవల వెయ్యి రాకెట్లు (తారాజువ్వల వంటివి) బయటపడ్డాయి. లండన్ మ్యూజియంలో భద్రపరిచిన రాకెట్లతో ఇవి పోలి ఉండడంతో పాటు టిప్పు సుల్తాన్ కాలం నాటివిగా భావిస్తున్న ఇలాంటి రాకెట్లనే మరి కొన్నింటిని కొంత కాలం క్రితమే వెలికి తీశారు. దీంతో దాదాపు 250 ఏళ్ల క్రితమే టిప్పు సుల్తాన్ శత్రువుపై ముఖ్యంగా ఇంగ్లీష్ బలగాలు మైసూరు రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఎలాంటి యుద్ధనీతులు, సైనికవ్యూహాలతో పాటు ఎలాంటి వినూత్న ఆయుధాలు ఉపయోగించి ఉంటాడనేది చర్చనీయాంశమైంది. ఆంగ్లేయులతో మైసూరు రాజ్యానికి జరిగిన యుద్ధాల్లో ‘రాకెట్వ్యూహం’ విస్తృతంగా ఉపయోగించినట్టు వెల్లడైంది. ‘శత్రువు ఉపయోగించిన మందుగుండు, ఇతర ఆయుధాల కంటే కూడా రాకెట్ల వల్లనే బ్రిటీష్ సైన్యానికి ఎక్కువ నష్టం వాటిల్లింది’ అని చరిత్రకారులు ఎల్.డే, ఐ.మెక్నీల్ తమ గ్రంథం ‘బయోగ్రఫికల్ డిక్షనరీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ టెక్నాలజీ’లో పేర్కొన్నారు. టిప్పు బలగాలు మెరుగైన సైనిక నైపుణ్యాలు కలిగి ఉన్న కారణంగా నాలుగో యుద్ధంలో దౌత్యపరమైన నైపుణ్యాలతోనే మైసూరు సైన్యంపై బ్రిటీష్‌సైన్యం చివరగా గెలుపొందగలిగిందనే అభిప్రాయంతో చరిత్రకారులున్నారు. అసలేమిటీ రాకెట్ల చరిత్ర ? 19వ శతాబ్దం మొదట్లో నెపోలియన్ యుద్ధాల్లో భాగంగా ఫ్రాన్స్‌తో బ్రిటన్ తలపడినపుడు అప్పటి వరకు ఐరోపా ఖండంలోనే ఎవరు ఉపయోగించని ‘కాంగ్రీవ్ ర్యాకెట్’లు ప్రయోగించింది. ఇంగ్లిష్ సైన్యానికి చెందిన సర్ విలియమ్ కాంగ్రీవ్ దీనిని కనిపెట్టినట్టు భావిస్తున్నారు.18వ శతాబ్దం ప్రారంభంలో పలు ప్రయోగాలు నిర్వహించాక ‘మండే తారాజువ్వలు’ కాంగ్రీవ్ తయారుచేశారు. యుద్ధంలో వినియోగించినపుడు బాగా ప్రభావం చూపడంతో ఈ ర్యాకెట్లపై డెన్మార్క్, ఈజిప్ట్, ప్రాన్స్, రష్యా, ఇతర దేశాల మిలటరీ ఇంజనీర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే 19వ శతాబ్దం మధ్యలో చరిత్రకారులు బ్రిటీష్ మిలటరీ చరిత్ర, నేపథ్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసినపుడు కాంగ్రీవ్ రాకెట్ మూలాలు భారత్‌లో మరీ ముఖ్యంగా టిప్పు సుల్తాన్ రాజ్యంలో ఉన్నట్టు గుర్తించారు. కొన్ని శతాబ్దాల క్రితమే మండే బాణాల రూపంలో ఐరోపా దేశాల్లో వీటిని ఉపయోగించినా, టిప్పుకాలంలోనే వీటిని ఆధునీకరించడంతో ‘మైసూరు రాకెట్లు’గా ఇవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ‘ప్రధానంగా ఇంథనం పట్టి ఉంచేందుకు వీలుగా ఇనుపగొట్టాలు వినియోగించిన కారణంగా బ్రిటీషర్లకు తెలిసిన, చూసిన వాటి కంటే కూడా టిప్పు కాలం నాటి రాకెట్లు ఎంతో అధునాతనమైనవి’ అని శాస్త్రవేత్త రొద్దం నరసింహ పేర్కొన్నారు. ఏమిటీ ప్రత్యేకత ? ఇనుప గొట్టంతో తయారుచేసిన ఈ రాకెట్లు (ఇవి వివిధ సైజుల్లో ఉంటాయి) ఓ చివర మూసివేస్తారు. వెదురుబద్ధకు ఓ ట్యూబ్‌ను జతచేశాక అది మండే వాహకంగా (కంబాషన్ ఛాంబర్)గా పనిచేస్తుంది. వాటిలో గన్ఫౌడర్ను ఇంథనంగా ఉపయోగిస్తారు. ఈ రాకెట్లు 500 గ్రాముల గన్ఫౌడర్తో 900 మీటర్ల వరకు లక్ష్యాలు చేధించేలా రూపొందించారు. గతంలో ఐరోపా, చైనాతో సహా ఇండియాలోనూ కనుక్కున్న రాకెట్లలో (ఇనుప కేసింగ్ లేనివి కూడా) ఇంత ఎక్కువ దూరం వెళ్లలేకపోయినట్లు గుర్తించారు. ఈ రాకెట్ల ఉన్నతస్థాయి యాంత్రిక నిర్మాణంలో ఇనుము, స్టీలు, గన్‌పౌడర్‌ను మంచి మిశ్రమంగా ఉపయోగించిన తీరు అద్భుతమని చరిత్రకారులు హెచ్ఎం ఇఫ్తకార్ జామ్, జాస్మిన జైమ్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ పర్యవేక్షణలో ర చించిన ‘ద ఫతూల్ ముజాహిదీన్’ మిలటరీ మ్యానువల్‌లో సైనికదాడుల్లో రాకెట్ల వినియోగం గురించి వివరంగా రాశారు. ప్రతీ సైనికదళంతోనూ ‘జౌక్’గా పిలిచే రాకెట్‌సైన్యం ఉండేది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్అలీ కాలంలో 1200 మంది ఉన్న రాకెట్‌సైన్యం, టిప్పు కాలం నాటికి 5 వేల మందికి చేరుకుందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. - సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
స్వాతంత్య్రానికి పూర్వమే అటవీ హత్యలు
సాక్షి ప్రతినిధి, కడప: అటవీ హత్యలు ఈనాటివి కావు. స్వాతంత్య్రం రాకముందు కూడా ఇలాంటి హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. అడవులను కాపాడుకోవాలనే దృక్పథాన్ని విడనాడి ప్రకృతి సంపద ద్వారా అక్రమార్జన చేయడానికి కొందరు అలవాటుపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ సిబ్బందిని స్మగ్లర్లు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. అలాంటి ఘటన 1939లోనే వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. స్మగ్లర్లతో పాటు క్రూరమృగాల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలన్న అటవీ సిబ్బంది విన్నపాన్ని పాలకులు 8 దశాబ్దాలుగా పెడచెవిన పెడుతున్నారు. 1939లోనే మూడు హత్యలు... చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెలో 1939 మార్చి 17న ముగ్గురు అటవీ సిబ్బంది హత్యకు గురయ్యారు. అటవీ సంపదను తెగనరకవద్దని అన్నందుకే వీరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కేశవులు, సోమయ్య, పెంచలు అనే ముగ్గురు అక్కడి ఫారెస్టు సంరక్షకులుగా ఉండేవారు. వంట చెరకు, ఇంటి సామగ్రి కోసం అడవిని స్థానికులు నిత్యం ధ్వంసం చేస్తుండేవారు. కటారి పాపయ్య అనే వ్యక్తి అడవిని కొల్లగొడుతుండటంతో కేశవులు పరుషంగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన కటారి పాపయ్య ముగ్గురిని హత్యచేసి మృతదేహాలను అడవిలో పారేశాడు. ఈ కేసుకు సంబంధించి కటారిపాపయ్యకు మరణశిక్ష విధించగా తన పలుకుబడితో యావజ్జీవ శిక్షకు పరిమితం చేసుకున్నాడు. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి సిబ్బంది గుర్తుగా స్మారకస్థూపం ఏర్పాటైంది. ఆ నాటి నుంచి ఆ ప్రాంతాన్ని కేశవుల బండ అని పిలుస్తున్నారు. పునరావృతం అవుతున్న ఘటనలు.... అక్రమార్జనకు ఎర్రచందనం ఆర్థిక వనరుగా మారడంతో తరుచూ అటవీ యంత్రాంగ ంపై దాడులు జరుగుతున్నాయి. జిల్లాలో 2010లో పుల్లలమడుగు బీట్‌లో అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు కాల్పులు జరిపారు. సుండుపల్లె సమీపంలో అటవీ సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు చేశారు. కడప సమీపంలోని పాలకొండల్లో ఓబులేసు అనే బీట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. మైదుకూరు సెక్షన్ పరిధిలో వరుస దాడులు జరిగాయి. అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని రక్షించాలంటే అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరమని ఉన్నతాధికారులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కడప, చిత్తూరు, కర్నూలు అటవీ సిబ్బందికి 400 తుపాకులు అవసరమని నివేదికలు సమర్పించారు. ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఎర్రచ ందనం స్మగ్లర్లకు ఇష్టారాజ్యమైంది. అనతి కాలంలోనే కోటీశ్వర్లుగా చ లామణి అవుతుండటంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పాలకుల అండతోనే.. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్న పాలకుల అండదండలతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్లు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గజ్జల శ్రీనివాసులరెడ్డిపై వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు ఏడు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డితో శ్రీనివాసులరెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడు. ‘గజ్జ గల్లు- అడవి ఘెల్లు’ అంటూ గత ఏడాది సాక్షి కథనం కూడా ప్రచురించింది. గజ్జల శ్రీనివాసులరెడ్డి అలియాస్ శ్రీనురెడ్డి కొన్నేళ్ల క్రితం కోర్టులో లొంగిపోయాడు. అప్పట్లో అటవీ యంత్రాంగం శ్రీనురెడ్డిపై పీడీ యాక్టు అమలు చేసింది. కొంత కాలం జైలు జీవితం గడిపిన శ్రీనురెడ్డి చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా బయటికొచ్చాడు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా శ్రీను రెడ్డి పత్రికలలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి స్మగ్లర్లను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలకు ఇటువంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు.