ప్రపంచంలో ఇస్రోది నాలుగో స్థానం | ISRO FOURTH PLACE IN INDIA | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఇస్రోది నాలుగో స్థానం

Published Fri, Sep 16 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

ISRO FOURTH PLACE IN INDIA

  • డిప్యూటీ మేనేజర్‌ వీఆర్‌కేఎస్‌ వరప్రసాద్‌
  • బాలాజీచెరువు (కాకినాడ) :
    అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇస్రో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని ఆ సంస్థ డిప్యూటీ మేనేజర్‌ వీఆర్‌కేఎస్‌  వరప్రసాద్‌ తెలిపారు. కాకినాడ ఆదిత్య అకాడమీకి శుక్రవారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
    సాక్షి : ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పరిశోధనలు చేసింది?
    వరప్రసాద్‌ : ఇప్పటివరకూ 36 రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగా వాటిలో 34 విజయవంతమయ్యాయి.
    సాక్షి : కొత్తగా ప్రాజెక్టుల గురించి..
    వరప్రసాద్‌ : ఈ నెల 26న పీఎస్‌ఎల్‌వీ–35 ద్వారా ఫారిన్‌ శాటిలైట్‌ రిమోట్‌ సిస్టమ్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నాము.
    సాక్షి : అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారా?
    వరప్రసాద్‌ : పర్యావరణానికి ముప్పు కలగకుండా, జీవరాశులకు నష్టం వాటిల్లకుండా సమాజంలో సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
    సాక్షి : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ముఖ్య ఉద్దేశ్యమా?
    వరప్రసాద్‌ : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశ్యం. దానికోసం 1967 అక్టోబర్‌ 10న ఒప్పందం జరిగింది.
    సాక్షి : అంతరిక్ష వారోత్సవాల ఉద్దేశ్యమేమిటి?
    వరప్రసాద్‌ : నేటికీ చాలామందికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల పనితీరు, వాటి ఉపయోగాల గురించి తెలీదు. సామాన్య మానవుడికి సహితం అర్థమయ్యే రీతిలో అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు ప్రదర్శిస్తాం. వీటికి జిల్లాలవారీగా విద్యాసంస్థలను ఎంచుకుని ఆ ప్రాంత ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement