imports Reduced
-
నాలుగేళ్ల ఆంక్షలు ఎత్తివేత!
వాహన దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. అక్టోబర్ 1, 2024 నుంచి వివిధ దశల్లో ఈ నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక 2020లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 2022లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో స్థానిక ప్రభుత్వం రద్దయింది. దానికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. తర్వాత శ్రీలంకలో ఇతర పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. క్రమంగా స్థానిక ఆర్థిక పరిస్థితులు గాడినపడుతున్నాయి.ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ నిబంధనల్లో భాగంగా దేశీయంగా వివిధ దశల్లో వాహన దిగుమతులు పెంచాలని శ్రీలంక నిర్ణయించింది. మొదట దశలో అక్టోబర్ 1, 2024న ప్రజా రవాణా వాహనాలు, రెండో దశ కింద డిసెంబర్ 1, 2024 నుంచి వాణిజ్య వాహనాలు, మూడో దశ ఫిబ్రవరి 1, 2025 నుంచి ప్రైవేట్ మోటార్ వాహనాల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ మారక నిల్వల నిర్వహణకు మాత్రం అదనపు కస్టమ్స్ సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2022లో భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది రైతులకు సాయంభారత్లో వాహన తయారీ కంపెనీలైన మారుతీసుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్..వంటి కంపెనీలకు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆ దేశానికి ఎక్కువగా ఈ కంపెనీలు వాహనాలు సరఫరా చేస్తుంటాయి. దాంతో రానున్న రోజుల్లో కంపెనీల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
గోల్డ్ బాండ్.. రివర్స్!
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ఎస్జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఊరిస్తున్న రాబడులు ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్లో ఒక ఎస్జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007. నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి. ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
రష్యా నుంచి చమురు దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: వర్షాకాలంలో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో 7 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనాల కార్గో ట్రాకింగ్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రష్యా నుంచి భారత్ గత నెలలో రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇది అంతక్రితం నెలలో రోజుకు 1.91 బీపీడీగా నమోదైంది. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు దిగుమతులను తగ్గించుకుంది. ఇరాక్ క్రూడ్‌ను 8,91,000 బీపీడీ నుంచి 8,66,000 బీపీడీకి, యూఏఈ ఆయిల్‌ను 2,90,000 బీపీడీ నుంచి 2,73,000 బీపీడీకి, అమెరికా క్రూడ్‌ను 2,19,000 బీపీడీ నుంచి 1,60,000 బీపీడీకి తగ్గించుకుంది. అయితే, సౌదీ అరేబియా నుంచి మాత్రం పెంచుకుంది. జులైలో సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు జులైలో 4,84,000 బీపీడీగా ఉండగా ఆగస్టులో 8,20,000 బీపీడీకి పెరిగాయి. ‘పలు రిఫైనింగ్ సంస్థలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే క్యూ4లో పండుగ సీజన్ వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగితే ముడి చమురు దిగుమతులు పుంజుకోగలవు‘ అని వర్టెక్సా అనాలిసిస్ హెడ్ (ఆసియా పసిఫిక్) సెరెనా హువాంగ్ తెలిపారు. గతేడాది ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌కు మార్కెట్ రేటు కన్నా చౌకగా క్రూడాయిల్‌ను రష్యా ఆఫర్ చేసింది. అప్పటివరకు భారత్ దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ వాటా 2 శాతం లోపే ఉండేది. ఆ తర్వాత పరిణామాలతో ఇది ఏకంగా 33 శాతానికి ఎగిసింది. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
అక్టోబర్‌లో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్ డిజిట్లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 8.71 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్ డాలర్లు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్‌లో వృద్ధిబాటకు (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన ఎగుమతులు అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చాయి. సమీక్షా నెల్లో 5.12 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో 24.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక దిగుమతులు కూడా 11.53 శాతం క్షీణతతో 33.60 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి వాణిజ్యలోటు కేవలం 8.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఎగుమతులు భారీగా పడిపోయిన ప్రొడక్టుల్లో పెట్రోలియం ఉత్పత్తులు (–52 శాతం), జీడిపప్పు (–21.57 శాతం), రత్నాలు, ఆభరణాలు (–21.27 శాతం) తోలు (–16.67 శాతం), మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ (12.8 శాతం), ఎలక్ట్రానిక్ గూడ్స్ (–9.4 శాతం), కాఫీ (–9.2 శాతం), సముద్ర ఉత్పత్తులు (– 8 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–3.75 శాతం) ఉన్నాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది. ► అక్టోబర్‌లో చమురు దిగుమతులు 38.52 శాతం పడిపోయి, 5.98 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతుల విలువ 27.62 బిలియన్ డాలర్లు. ఏడు నెలల్లో ఎగుమతులు 19 శాతం క్షీణత కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2020 వరకూ చూస్తే, ఎగుమతులు 19.02 శాతం పడిపోయి 150.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు సమీక్షా కాలంలో 32.15 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో చమురు దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్‌కు సానుకూలం దిగుమతుల క్షీణత నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదుచేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. ఒక నిర్థిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) కరెంట్ అకౌంట్ ‘మిగులు’ను నమోదుచేస్తుంది. ఈ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అగ్రి ఎగుమతులు ప్రోత్సాహకరం... అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం ప్రోత్సాహకర అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడానికి సమయం ఆసన్నం అయ్యింది. గడచిన రెండు పంట కాలాల్లో దేశం మంచి ఉత్పత్తులను సాధించిన విషయం ఇక్కడ గమనార్హం. ఫార్మా, రసాయనాలుసహా పలు పారిశ్రామిక రంగాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటుతుండడం గమనార్హం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ వ్యవస్థాపక చైర్మన్ -
సరుకులపై ‘సమ్మె’ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం కనిపిం చింది. సిమెంట్, స్టీల్ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది. మరింత ఉధృతం చేస్తాం.. మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు. ధరలకు రెక్కలు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్ మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్బల్లాపూర్ నుంచి వచ్చే బిన్నీస్ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. భారీగా పడిపోయిన అమ్మకాలు లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం స్వల్పమే ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ ధరలు పెరిగాయి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. – జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి ధరలు భగ్గుమంటున్నాయి రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు. – సయ్యద్ ముక్తార్, వినియోగదారుడు -
2013 - ప్రభుత్వం దెబ్బకు తగ్గిన బంగారం దిగుమతులు
బంగారానికి సంబంధించి ఈ ఏడాది మన దేశంలో కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగడం, తగ్గడం కూడా జరిగింది. అలాగే బంగారం దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం మూడుసార్లు దిగుమతి సుంకం పెంచింది. దాంతో దిగుమతులు బాగా తగ్గాయి. బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాక అదే స్థాయిలో పతనమైంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏడాది మొత్తంలో దాదాపు 8 వేల రూపాయల వరకు వ్యత్యాసంతో అమ్మకాలు జరిగాయి. మే నెలలో 25 వేల రూపాయలకు పడిపోతే, ఆగస్ట్‌లో 33 వేల రూపాయలు దాటి పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 30.860 రూపాయలు ఉన్న ధర ఏప్రిల్ నెలలో 25, 654 రూపాయలకు పతనం అయింది. మళ్లీ మూడు నెలల్లో ఆగస్ట్‌లో 33,640 రూపాయలకు చేరింది. డిసెంబరు 23కు వచ్చేసరికి 28,550 రూపాయల వద్ద అమ్మకాలు జరుగాయి. బంగారం దిగుమతులు విదేశీ మారకద్రవ్యాన్ని హరించివేస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తున్న పసిడిపై మోజు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రజలను బతిమిలాడారు. దేశ భవిష్యత్తు ప్రయోజనాల కోసమైనా దయచేసి బంగారాన్ని కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. బంగారం దిగుమతి తగ్గకపోగా, బంగారు ఆభరణాల ఎగుమతి కూడా తగ్గిపోతోంది. ఇది మరీ ఆందోళన కలిగించింది. భారత్ ఎగుమతులు-దిగుమతుల విధానంపై బంగారం తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఒక దశలో వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బంగారం దిగుమతి పెరగడంతో రూపాయిపై వత్తిడి కూడా పెరిగిపోతోంది. ఇక ప్రభుత్వానికి కఠిన చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ తగ్గించేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 8 శాతానికి, 8 నుంచి 10 శాతానికి, 10 నుంచి 15 శాతానికి మూడు సార్లు ప్రభుత్వం పెంచింది. బంగారం డిమాండ్ తగ్గించడానికి, దిగుమతికి కళ్లెం వేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ ఏడాది 900 టన్నుల వరకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ బంగారం 400 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. 2011లో 969 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2012లో 860 టన్నులు దిగుమతి అయింది. ఈ ఏడాది పుత్తడి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వరకు తగ్గి 500 టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రమాదం వచ్చి పడింది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండటం వల్ల అక్రమ రవాణా పెరిగింది. ఈ విషయాన్ని శీతాకాల లోక్‌సభ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది బంగారం ధరల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నెల ప్రారంభంలో ధర చివరిలో ధర జనవరి రూ.30,860 రూ.30.212 ఫిబ్రవరి రూ.29,856 రూ.29,735 మార్చి రూ.29,588 రూ.29,448 ఏప్రిల్ రూ.29411 రూ.27,183 మే రూ.26,895 రూ.27185 జూన్ రూ.26,897 రూ. 25,563 జూలై రూ.25,665 రూ. 28,641 ఆగస్ట్ రూ. 28,182 రూ. 33,010 సెప్టెంబర్ రూ. 32,980 రూ. 30,737 అక్టోబర్ రూ. 30,450 రూ. 30,225 నవంబర్ రూ. 29,825 రూ.30,249 డిసెంబర్ రూ. 30,221 రూ. 29,620 s.nagarjuna@sakshi.com