గోల్డ్ బాండ్ల ద్వారా రూ.6,030 కోట్లు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ రూ.6,030 కోట్ల విలువైన పెట్టుబడులను సమీకరించగలిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 28న జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచి స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ప్రారంభమయిన సందర్భంలో ఆర్‌బీఐ తాజా ప్రకటన విడుదల చేసింది. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం.