Mint Compound
-
హైదరాబాద్ మింట్ కాంపాండ్ లో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ మింట్ కాంపాండ్ లో గన్ మిస్ ఫైర్
-
HYD: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రామయ్య గురువారం మింట్ కాంపౌండ్‌లో విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో, బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది కూడా చదవండి: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం -
కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్ ఔట్లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్‌గా, లేదంటే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don't forget to purchase some gold and pray to Lord Vishnu. Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm — India Government Mint (@SPMCILINDIA) April 22, 2023 మింట్ అంటే ఎమిటీ? దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్ కేంద్రాలు అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మింట్ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే? భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆధ్వర్యంలో మింట్ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్ తయారవుతాయి. ♦ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, న్యూఢిల్లీ ♦నోయిడా డీ-2 సెక్టార్ 1 ♦ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్డు ♦హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్ 2, చర్లపల్లి ♦కోల్‌కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. మింట్ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే ఎవరైనా సిల్వర్, గోల్డ్ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్‌తో సహా కేంద్రం మింట్ అవుట్లెట్లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్క్ పొందినగోల్డ్ కాయిన్స్ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్‌తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది. గోల్డ్‌పై లోన్ కూడా దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
మన హైదరాబాద్‌లో 100% గ్రీన్ ఆఫీస్! అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి నెట్‌జీరో ప్రభుత్వ కార్యాలయ భవనం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆధునిక హంగులతో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) కోసం 1,872 గజాలు, ఐదంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ భవనంలో నూటికి నూరు శాతం పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరిస్తున్నారు. నిరంతరం చల్లదనం ఉండేలా... భవనం శ్లాబ్‌లో స్టీల్, కాంక్రీట్ మిశ్రమంతోపాటు రేడియంట్ ఫ్లోర్ పైపులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పైపుల్లో నిరంతరం నీరు ప్రవహిస్తూ భవనం పైకప్పు నుంచి లోనికి వేడి రాకుండా ఇది నియంత్రించనుంది. దీంతో భవనం ఎల్లప్పుడూ చల్లదనంతో ఉండనుంది. ఫలితంగా ఏసీలు, ఫ్యాన్ల వినియోగం గణనీయంగా తగ్గనుంది. ఎంత ఖర్చు చేస్తే.. అంత ఉత్పత్తి.. భవనంలో ఎంత విద్యుత్‌ను ఖర్చు చేస్తున్నామో.. అంత ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో టీఎస్ రెడ్కో భవనాన్ని నిర్మిస్తున్నారు. సాధారణ భవనాల్లో ఏడాదికి ప్రతి చదరపు మీటరు (చ.మీ.)కు 175 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఎనర్జీ కన్జ ర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవనాలల్లో 120 యూనిట్లవుతుంది. అయితే టీఎస్రెడ్కో నిర్మించనున్న ఈ భవనంలో మాత్రం కేవలం 45 యూనిట్ల విద్యుత్ ఖర్చయ్యేలా రూపొందిస్తున్నారు. ఇందుకోసం భవన నిర్మాణ డిజైన్లోనే ఇంధన సమర్థత ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పైకప్పులో గాలి మర, సౌర విద్యుత్.. భవనం పైకప్పులో సౌర విద్యుత్ ఫలకాలు, గాలి మరను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భవన అవసరాలకు అయ్యే విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. భవనంలో విద్యుత్ వినియోగాన్ని తెలిపే అనలిటికల్ డేటా డిస్ప్లే, అగ్నిప్రమాదాల గుర్తింపు అలారం, సమాచార డ్యాష్ బోర్డులు, ఎల్ఈడీ డిస్ప్లే వంటివి ఉండనున్నాయి. సాధారణ స్టీల్ నిర్మాణాలతో పోలిస్తే 10 శాతం అదనపు ధృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటోక్లేవ్డ్ ఏరోటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌తో నిర్మాణం చేపడుతున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవేశించేలా భవన డిజైన్‌ను రూపొందించారు. దీంతో భవనం లోపల విద్యుత్ ఉపకరణాల వినియోగం తగ్గనుంది. భవనం తొలి 3 అంతస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ (టీఎస్ఎన్పీడీసీఎల్) కార్యాలయం, 4, 5 అంతస్తులలో రెడ్కో ఆఫీసు ఏర్పాటు కానున్నాయి. జూన్ నాటికి అందుబాటులోకి.. ఈ భవన డిజైన్లను ఢిల్లీకి చెందిన అశోక్ బీ లాల్ అర్కిటెక్ట్స్ రూపొందించగా.. జైరాహ్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ నిర్మిస్తోంది. బేస్మెంట్, స్టిల్ట్‌తోపాటు ఐదంతస్తుల్లో భవనం ఉంటుంది. ప్రతి అంతస్తు 8 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. రూ. 22.76 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ శ్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
బిల్లుతో తీవ్ర నష్టం: కేంద్ర ప్రభుత్వంపై కరెంటోళ్ల కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే ఆందోలనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆగస్టు10వ తేదీన మెరుపు సమ్మెకు విద్యుత్ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడంతో విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. -
రూ . 40 చోరీ : ఏడేళ్ల జైలు?
ముంబై : ప్రభుత్వ మింట్‌లో 40 రూపాయలను దొంగిలించిన వ్యక్తిపై ముంబైలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్ట్ ప్రాంతంలోని మింట్‌లో త్వరలో విడుదల కాబోయే 20 రూపాయల నాణేలు రెండింటిని ఆర్ఆర్ చబుక్షర్ చోరీ చేశారు. ఈ నాణేలను ఆయన లాకర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చబుక్షర్ ప్రభుత్వ మింట్ నుంచి తొలిసారి చోరీ చేశాడా, గతంలోనూ చోరీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి లాకర్లో నాణేలున్నాయని సీనియర్ అధికారుల ఫిర్యాదుతో సీఐఎస్ఎఫ్ పోలీసులు లాకర్‌ను తెరిచిచూడగా నాణేలు బయటపడ్డాయి. చోరీకి గురైన నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 381 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2019 మార్చిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన పలు నాణేల్లో 20 రూపాయల నాణెం కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ నాణెం విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. కాగా, నిందితుడు నాణేలను చోరీ చేసినా రోజువారీ తనిఖీలతో వాటిని బయటకు తీసుకువెళ్లలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తితో నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. చదవండి : ‘ఆరు రెట్లు అధిక ధరకు అమ్ముతూ చిక్కారు’ -
‘మింట్ కాంపౌండ్’ దాతృత్వం
హైదరాబాద్: సుమారు రూ.కోటి విలువైన వైద్య పరికరాలను గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి వితరణగా అందించి మింట్ కాంపౌండ్ ఇండియా తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మింట్ కాంపౌండ్ ఇండియా హైదరాబాద్ శాఖ చీఫ్ ఆపరేషన్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ రాములు వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ.. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలను తాము అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద రోగుల కోసం ఏదైనా చేయమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఆర్ఎంఓ శేషాద్రి తమను కోరారన్నారు. దీంతో రెండు వేక్ థెరపీ మిషన్లు, ఎండోవీనస్ లేజర్ మిషన్, 2డీ ఎకో, రెండు లాప్రోస్కోపిక్ మిషన్లు, హైఫ్రీక్వేన్సీ ఇంపెడెన్స్ మనోమెట్రీ, జెసిస్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఆపరేటింగ్ హిస్టరోస్కోపీ వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించామన్నారు. కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి గాంధీ ఆస్పత్రిలో నిరుపేద రోగులకు మరిన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకురావాలని శ్రవణ్‌కుమార్ కోరారు. గత రెండేళ్లలో గాంధీ ఆస్పత్రిలో అనేక అభివృద్ధి, వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టామని, వందల సంఖ్యలో అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా గాంధీ ఖ్యాతిని ఇనుమడింపజేశామన్నారు. గాంధీ ఆస్పత్రిలో రూ.30 లక్షల వ్యయంతో పేషెంట్ అటెండర్ షెడ్, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రవణ్‌కుమార్, హెచ్వోడీలు రాజారావు, శోభన్‌బాబు, మహాలక్ష్మీ, శ్రీహరి, ఆర్ఎంవోలు జయకృష్ణ, శేషాద్రిలతోపాటు మింట్ కాంపౌండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిల్లులకు చిల్లులు
• 1104 యూనియన్ రూ.45 లక్షలకుపైగా బాకీ • 327 యూనియన్ రూ.8.34 లక్షల బకాయిలు సాక్షి, హైదరాబాద్: వారు బిల్లుల వసూళ్లలో కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. వినియోగ దారులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. ఇంటికి వచ్చి ఫ్యూజ్ తీసుకెళ్లడమో, కరెంట్ కనెక్షన్ తొలగించడమో చేస్తుంటారు. కానీ తమ యూనియన్ కార్యాలయాల బిల్లులు చెల్లించకున్నా కిమ్మనకుండా ఉండిపోతారు. ఇదీ కరెంటోళ్ల లీల. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యుత్ ఉద్యోగ, కార్మిక యూనియన్ల కార్యాలయాలు దశాబ్దాలుగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయా యి. అయినా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) యాజ మాన్యం యూనియన్ల కార్యాలయాలకు నిరాటంకంగా విద్యుత్ సరఫరాను కొనసా గిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల నుంచి యూని యన్లు లక్షల రూపా యల సభ్యత్వ రుసుం వసూ లు చేస్తున్నాయి. యూనియ న్లు పోటాపోటీగా పెద్ద ఎత్తున డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్య క్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ, ఏటా వచ్చే ఆదాయం నుంచి కొంత బిల్లులకు వెచ్చించడానికి యూనియన్ల నేతలు చొరవ చూపడం లేదు. జిల్లాల్లో అయితే యూని యన్ల కార్యాలయాలకు విద్యుత్ మీటర్లు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1104 వర్కర్స్ యూని యన్ కార్యాలయం రూ.45.32 లక్షలు. 327 కార్యాలయం రూ.8.34 లక్షలు. తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రూ.4.02 లక్షలు, ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.4.47 లక్షలు, ఏపీఎస్ఈబీ టెక్నికల్ ఎంప్లాయీస్ యూనియన్ రూ.1.46 లక్షలు, స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.69,140 బకాయిలను డిస్కంకు చెల్లించాల్సి ఉంది. -
మింట్ కాంపౌండ్‌లో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: మింట్ కాంపౌండ్‌లో కరెంట్ షాక్‌తో ఒక ఉద్యోగి మృతి చెందటంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహ్మద్ సిద్దిఖీ అనే కాంట్రాక్టు ఉద్యోగి మంగళవారం సాయంత్రం విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. -
ఉపాధి మర్రి
చెట్టు నీడనిస్తుంది. కానీ ఈ చెట్టు.. బతుకుదెరువునిస్తోంది. కాలమేదైనా సరే... అక్కడి పుచ్చకాయలు చల్లగా కడుపునింపుతాయి. నగరంలో తిరిగి అలసిన వారికి ఆ చెట్టు కింది నిమ్మ సోడా సాంత్వననిస్తుంది. మోటార్ సైకిల్‌పై మొబైల్ మెస్... ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతుంది. అద్దెలు చెల్లించలేని చిరు వ్యాపారులకు బతుకు నీడనిస్తోంది మింట్ కాంపౌండ్ సమీపంలోని మర్రి చెట్టు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ చెట్టు డజనుకుపైగా వ్యాపారాలకు కేంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై షికార్లు కొట్టి అలసిన వారు, కార్యాలయాల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన ఉద్యోగులు, ఆయా పనుల నిమిత్తం సెక్రటేరియేట్‌కు వచ్చే సామాన్యుల అవసరాలను తీర్చే కేంద్రంగా మారింది. ప్రతి కాలంలో పుచ్చకాయ... వేసవిలోనే పుచ్చకాయలు దొరుకుతాయి. ఈ మర్రిచెట్టు నీడలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల కార్యాలయాల వాళ్లే కాదు... కూడలిలో ఉండటంతో వచ్చీపోయే జనం కూడా అక్కడ ఆగి మరి పుచ్చకాయలు తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ పుచ్చకాయల వ్యాపారంపై ఆధారపడి రెండు కుటుంబాలు బతుకుతున్నాయి. ‘ఫుల్’గా భోజనం... ఆకలి అవుతుంటే దగ్గర్లో ఏ హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వందకు పైగా చెల్లించాల్సిందే. కానీ ఈ చెట్టు నీడన 40 రూపాయలకే పూర్తి భోజనం లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... అనేక మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇలా మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. భోజనం వద్దనుకుంటే... అల్పాహార కేంద్రం కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్య పరీక్షలు... ఇదే మర్రిచెట్టు నీడన ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే చాలు మీ ఎత్తుకు తగ్గ బరువున్నారా? మీ ఒంట్లో ఎంత కొవ్వు శాతం ఎంత? బీపీ తక్కువా? ఎక్కువా? తెలిపే ఓ యువకుడు కనిపిస్తాడు. ఒంటి నొప్పులకు, ఒత్తిడికి అక్యుపంక్చర్ వైద్యం ఎంతో ఉపశమనం. దీనికి సంబంధించిన పరికరాలు కూడా ఈ చెట్టు కింద లభిస్తాయి. వస్త్ర వ్యాపారం అదుర్స్.. సామాన్యులకు అందుబాటు ధరలో దుస్తుల వ్యాపారం ఓ పక్క జరుగుతుంటే... మరోపక్క కాలి బూట్లు, చెప్పులు అమ్ముతుంటాడో వ్యక్తి. ఓవైపు సోడా బండి, ఆ పక్కనే ఫ్రూట్ జ్యూస్ బండి ఉంటుంది. ఇంత మంది వచ్చే చోట వాహనాల రద్దీ ఉంటుంది కదా! వాటి పొల్యూషన్ చెకప్ చేయడానికి ఆర్టీఏ అనుమతి పొందిన ఏజెంట్ కూడా అక్కడే సిద్ధంగా ఉంటాడు. ఇలా చిరు వ్యాపారులకు ఆ మర్రి చెట్టు కల్పవృక్షంగా మారింది. ...::: వాంకె శ్రీనివాస్ -
వాస్తు దోషంతో సీఎం కాన్వాయ్ రూటు మార్పు
హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో ‘సీ’ బ్లాక్‌కు వెళ్లే దారిలో వాస్తు దోషం ఉందని, దానిని సరిచేయడానికి తన కాన్వాయ్ వెళ్లే దారిని మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మింట్‌కంపౌండ్ వైపు నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన గేటు ద్వారా లోపలికి ప్రవేశించే ముఖ్యమంత్రి నల్లపోచమ్మ దేవాలయం రావడానికి ముందే కుడివైపు తిరిగి ‘సీ’ బ్లాకు వైపు వెళ్లేవారు. ఈ దారి మలుపుల మయంగా ఉండడం, అదీకాక వాస్తు రీత్యా సరికాదని భావించిన సీఎం ప్రత్యామ్నాయ రహదారిని అధికారులకు సూచించారు. -
తెలంగాణ సచివాలయం ముస్తాబు
- సర్వాంగ సుందరంగా అలంకరించిన అధికారులు - కొత్త సీఎంకు మింట్ కాంపౌండ్ నుంచి రహదారి - సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలన - నల్ల పోచమ్మ గుడి వద్ద పూజలు చేయనున్న కేసీఆర్ - గుడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు రెడ్ కార్పెట్ స్వాగతం - సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్న టీఆర్ఎస్ అధినేత సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. తెలంగాణ సచివాలయం ఏర్పాటైంది. సోమవారం నుంచి దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న తెలంగాణకు పరిపాలనా కేంద్రమైన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేసీఆర్ సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయం లోపల, ప్రహరీగోడలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయానికి లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న గేటును ప్రధాన మార్గంగా వినియోగించేవారు. ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర ఇరు రాష్ట్రాల కోసం వేర్వేరు సచివాలయాలుగా విభజించడంతో.. తెలంగాణ సచివాలయానికి కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. మింట్ కాంపౌండ్ వైపు నుంచి సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలుగా అక్కడున్న పాఠశాలను తొలగించి కొత్త రహదారి నిర్మించారు. ఈ రహదారిపై ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించారు. ఇక సచివాలయం గేటు నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించే ‘సీ’ బ్లాక్ వరకు అడుగడుగునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌లో తెలంగాణ సచివాలయ గేటు నుంచి లోపలికి ప్రవేశించే కేసీఆర్ నేరుగా వెళ్లి నల్లపోచమ్మ గుడి వద్ద దిగుతారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అక్కడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు ఏర్పాటు చేసే రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మార్గంలో కేసీఆర్ నడిచి వస్తుండగా.. పూలతో సచివాలయ సిబ్బంది స్వాగతం పలుకనున్నారు. c బ్లాకు ఆరో అంతస్తులోని కార్యాలయంలో కేసీఆర్ మధ్యాహ్నం 12.57 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం ‘సీ’ బ్లాక్ ముందు ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అక్కడ కూర్చోవడానికి గ్రీన్ కార్పెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ.. ఉద్యోగులు పనిచేయడానికి రావడంతో సందడి నెలకొంది. ఐఏఎస్ అధికారుల హడావుడి.. మరైవెపు సచివాలయంలో ఐఏఎస్ అధికారుల హడావుడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ విరమణతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయనను కలవడానికి వచ్చారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్లు కూడా మహంతిని కలిశారు. కాగా.. తెలంగాణ సచివాలయం గేటు ఏర్పాటు కోసం తొలగించిన పాఠశాల కోసం..‘బీ’ బ్లాక్ వెనుకభాగంలో ఉన్న భవనాన్ని ఆ విద్యార్జన పాఠశాల కోసం సీఎస్ ఉన్నతాధికారులతో కలసి పరి శీలించారు. అధికారులు రేమండ్ పీటర్, బూసి శాంబాబ్, వెంకటేశ్వరరావు, శశిభూషణ్ కుమార్, పూనం మాల కొండయ్య తదితరులు ఈ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలకు బయటి వైపు నుంచి గేటు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు. -
డబ్బు కొట్టు..పని పట్టు
=బడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు =కనీస షెడ్డు లేని వారికి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనుల అప్పగింత =ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలకుపైగా వసూలు =తీవ్రంగా నష్టపోతున్న చిరు కాంట్రాక్టర్లు సాక్షి,సిటీబ్యూరో: సెంట్రల్ డిస్కంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల పనులకు‘టెండర్’ వేశారు. కాంట్రాక్టర్ల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపి పోటీ నుంచి తప్పిస్తున్నారు. కనీసం షెడ్డు కూడా లేని వ్యక్తులకు నాలుగు నుంచి ఐదు టెండర్లు కట్టబెడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ రూ.రెండు లక్షలకుపైగా అధికారులకు ముట్టజెప్పుతుండడం విశేషం. రంగారెడ్డిలోని ఓ సీజీఎం స్థాయి అధికారి మొదలు డిస్కంలోని పలువురు డెరైక్టర్లకు ఇందులో ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 11 సర్కిళ్లు ఉండగా, వీటిలో 138 ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఆయా సర్కిళ్ల పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం మింట్‌కాంపౌండ్‌లోని సీసీఎం ఆర్ఆర్ కార్యాలయం 2012 డిసెంబర్లో ఓపెన్ టెండర్లు పిలిచింది. ఇందుకు కనీసం రెండేళ్ల అనుభవాన్ని నిర్ధేశించారు. దీంతో కొంతమంది ఔత్సాహిక చిరు కాంట్రాక్టర్లుసీఎండీని కలిసి ఈ నిబంధనల నుంచి తమకు సడలింపు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన అంగీకరించడంతో 70కిపై గా టెండర్లు దాఖలు అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్నారిలా..: అయితే అప్పటికే వేర్వేరు డివిజన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఏడాదిన్నర నుంచి మరమ్మతులు చేస్తున్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణం, సిబ్బంది, ఇతరత్రా వసతుల కోసం ఒక్కొక్కరు భారీగా ఖర్చు పెట్టారు. తీరా గడువు దగ్గర పడటంతో రెండేళ్ల అనుభవాన్ని సాకుగా చూపి, వీరందరి జీవితాలను రోడ్డుపాలు చేశారు. గుత్తేదారుల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కనీసం షెడ్డు కూడా లేని ఒక్కో కాంట్రాక్టర్‌కు నాలుగు నుంచి ఐదు పనులు అప్పగిస్తున్నారు. పైరవీలతో పనులు దక్కించుకున్న వీరు కమీషన్‌పై సబ్‌కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతూ అక్రమాలకు తెరలేపుతున్నారు. చిన్నపాటి మరమ్మతులను పెద్దగా చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కారు: డిస్కం పరిధిలోని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం,ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీలకు వ్యక్తిగత కాంట్రాక్టుల్లో రూ.లక్షవరకు, సొసైటీలకు రూ.మూడు లక్షల వరకు ధరావతు మినహాయింపు కల్పించినా అధికారులు వీటిని అమలు చేయడం లేదని, దీంతో ఆవర్గం చిరు కాంట్రాక్టులు భారీగా నష్టపోవాల్సి వస్తోందని విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు గోపి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ లెసైన్స్బోర్డు సభ్యుడు నక్క యాదగిరిలు చెప్పారు.