దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంతటి వీరోచితంగా పోరాడతారో వరుణ్ తేజ్ చూపించనున్నారు. దేశంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా భారతీయ వైమానిక దళ పైలెట్‌గా వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గ్వాలియర్‌లో షూటింగ్ చేశాం. అక్కడి షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment