Shooting climax
-
గగన పోరాటంలో వరుణ్ తేజ్
దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంతటి వీరోచితంగా పోరాడతారో వరుణ్ తేజ్ చూపించనున్నారు. దేశంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా భారతీయ వైమానిక దళ పైలెట్‌గా వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గ్వాలియర్‌లో షూటింగ్ చేశాం. అక్కడి షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్లైమాక్స్‌కు చేరుకున్న ‘పంతం’
గోపీచంద్ సక్సెస్ రుచి చూసి చాలా కాలమైంది. ఆక్సిజన్, గౌతమ్‌నంద అంటూ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆరడుగుల బుల్లెట్ సినిమా సంగతి మాత్రం ఎవరికీ తెలియకుండా పోయింది. ఇలాంటి సమయంలో గోపీచంద్‌కు ఒక హిట్ సినిమా పడాలి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంగా ‘పంతం’ను ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్‌కు ఇది 25వ సినిమా కాగా, అతడికి జంటగా మెహరిన్ నటిస్తోంది. రాధమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ రోజు ఆహారం కూడా తీసుకోలేదు...
సాక్షి, బెంగళూరు : చిత్రీకరణ క్లైమాక్స్‌లో ఉండగా తమ ఆరు పలకల దేహం (సిక్స్ ప్యాక్ బాడీ) బాగా కనిపించాలన్న ఉద్దేశంతో డైట్లో ఉన్న అనిల్, ఉదయ్ రాఘవలు సోమవారం ఉదయం నుంచి ఘటన జరిగే వరకూ ఎటువంటి ఆహారం తీసుకోలేదని చిత్ర సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో ఘటన సయంలో ఇరువురూ సాధారణ షూ ధరించి ఉండటం, హెలిక్యాప్టర్ షాట్ చిత్రీకరణకు ముందు మరో షాట్ కోసం దాదాపు కిలోమీటరు పరిగెత్తడం తదితర కారణాలతో ఇరువురూ నీటిలో ఎక్కువ సేపు ఈద లేకపోయారు. దీంతో తెప్ప తమ వద్దకు వచ్చే సమయంలోనే మునిగి పోయారని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో నీటిలో మునిగి చనిపోయిన తర్వాత ఏ ప్రాణి దేహమైనా గరిష్టంగా 24 గంటల్లోపు నీటి పైకి తేలుతుంది. అరుుతే తిప్పగొండనహళ్లి ఘటన విషయంలో చెరువులో ఎక్కువగా పూడిక ఉండటం, చేప లకోసం వేసిన వలలు ఉండటంతో అనిల్, ఉదయ్రాఘవల దేహాలు అందులో చిక్కుకుపోయి ఉండటంలో నీటి పైకి తేలలేదని తెలుస్తోంది. 2012లో చివరి సారిగా తాగునీటికి వినియోగం.. తిప్పగొండనహళ్లి చెరువు చెరువు 1929లో మొదలు కాగా, 1933లో ముగిసింది. ఇక 532 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు 7 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతుంది. ఈ చెరువులో నీటిని బెంగళూరులో కొన్ని భాగాలకు 2012 ఏడాది వరకూ వినియోగించారు. అనంతరం ఈ నీటిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల తాగునీటికి ఈ చెరువు పనికిరాదని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఇక ఈ చెరువు 1998లో చివరిగా నిండింది.