ఆ రోజు ఆహారం కూడా తీసుకోలేదు...
సాక్షి, బెంగళూరు : చిత్రీకరణ క్లైమాక్స్‌లో ఉండగా తమ ఆరు పలకల దేహం (సిక్స్ ప్యాక్ బాడీ) బాగా కనిపించాలన్న ఉద్దేశంతో డైట్‌లో ఉన్న అనిల్, ఉదయ్ రాఘవలు సోమవారం ఉదయం నుంచి ఘటన జరిగే వరకూ ఎటువంటి ఆహారం తీసుకోలేదని చిత్ర సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో ఘటన సయంలో ఇరువురూ సాధారణ షూ ధరించి ఉండటం, హెలిక్యాప్టర్ షాట్ చిత్రీకరణకు ముందు మరో షాట్ కోసం దాదాపు కిలోమీటరు పరిగెత్తడం తదితర కారణాలతో ఇరువురూ నీటిలో ఎక్కువ సేపు ఈద లేకపోయారు.
దీంతో తెప్ప తమ వద్దకు వచ్చే సమయంలోనే మునిగి పోయారని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో నీటిలో మునిగి చనిపోయిన తర్వాత ఏ ప్రాణి దేహమైనా గరిష్టంగా 24 గంటల్లోపు నీటి పైకి తేలుతుంది. అరుుతే తిప్పగొండనహళ్లి ఘటన విషయంలో చెరువులో ఎక్కువగా పూడిక ఉండటం, చేప లకోసం వేసిన వలలు ఉండటంతో అనిల్, ఉదయ్‌రాఘవల దేహాలు అందులో చిక్కుకుపోయి ఉండటంలో నీటి పైకి తేలలేదని తెలుస్తోంది.
2012లో చివరి సారిగా తాగునీటికి వినియోగం..
తిప్పగొండనహళ్లి చెరువు చెరువు 1929లో మొదలు కాగా, 1933లో ముగిసింది. ఇక 532 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు 7 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతుంది. ఈ చెరువులో నీటిని బెంగళూరులో కొన్ని భాగాలకు 2012 ఏడాది వరకూ వినియోగించారు. అనంతరం ఈ నీటిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల తాగునీటికి ఈ చెరువు పనికిరాదని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఇక ఈ చెరువు 1998లో చివరిగా నిండింది.