గోపీచంద్ సక్సెస్ రుచి చూసి చాలా కాలమైంది. ఆక్సిజన్, గౌతమ్‌నంద అంటూ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆరడుగుల బుల్లెట్ సినిమా సంగతి మాత్రం ఎవరికీ తెలియకుండా పోయింది. ఇలాంటి సమయంలో గోపీచంద్‌కు ఒక హిట్ సినిమా పడాలి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంగా ‘పంతం’ను ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్‌కు ఇది 25వ సినిమా కాగా, అతడికి జంటగా మెహరిన్ నటిస్తోంది. రాధమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment