భోపాల్ : తాను పెంచుకుంటున్న కోళ్లలో ఒక కోడిని ఇచ్చేందుకు మహిళ నిరాకరించడంతో ఇద్దరు వ్యక్తులు ఆమెకు చెందిన కోళ్లను విషమిచ్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఝాన్సీరోడ్ పోలీస్ స్టేషన్‌లో మహిళ గుడ్డిభాయ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం...వైష్ణో ధామ్ ఆలయ సమీపంలో నివసించే గుడ్డి భాయ్ వ్యవసాయ పనులకు వెళుతూ మరికొంత ఆదాయం కోసం నాలుగు కోళ్లను కొనుగోలు చేసి కోడిగుడ్లను విక్రయిస్తూ జీవిస్తోంది.
ఈమె పొరుగున ఉండే సురేందర్, సమర్‌లు ఆమె పనులకు వెళ్లిన సమయంలో మహిళ ఇంటికి వెళ్లి తమకు ఓ కోడిని ఇవ్వాలని కోరగా ఆమె కుమార్తె నిరాకరించడంతో నాలుగు కోళ్లకు విషం ఎక్కించారు. పని నుంచి ఇంటికి వచ్చిన మహిళకు కుమార్తె నిందితుల నిర్వాకం వివరించడంతో చనిపోయిన కోళ్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment