మధ్యప్రదేశ్ లో ఒక పడవ నీట మునిగిపోవడంతో ఆరుగురు పనివాళ్లు జలసమాధి అయిపోయారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది.
మధ్యప్రదేశ్ లోని దతియా, గ్వాలియర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింధునదిలో నీటి వేగానికి పడవ కొట్టుకుపోయింది. ఆ తరువాత అదుపు తప్పి మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రయాణిస్తున్న వారంతా గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పడవ చాలా పాతది కావడం, అందులో ఎక్కాల్సిన వారికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
పడవ మునక, 6గురు మృతి, 18 మంది గల్లంతు
Published Mon, Apr 21 2014 11:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement