భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకుడు మహాత్మాగాందీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిన్హా గాల్వియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..డిగ్రీ పోందడం విద్య కాదని చెబుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదని, ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని చెప్పారు.
గాంధీజీ చదువుకోలేదని ఎవరూ అనరు. అలా చెప్పరు కూడా. కానీ ఆయన కేవలం హైస్పూల్ డిప్లొమాలో మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. అయితే చాలామంది ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాడనుకుంటారు కానీ ఆయన లా చేసేందుకు అర్హత సాధించాడే తప్ప డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంత చదువుకున్నాడంటే దేశానికి జాతిపిత అయ్యేంతగా జ్ఞానాన్ని సముపార్జించాడు. డిగ్రీలు చేశామనే దర్పంలో మునిగిపోకండి.
డిగ్రీ పొందడం చదువు కాదు. అలాగే మార్క్‌ట్వైన్ అనే కలం గురించి వినే ఉంటారు. ఆ కలంతో పుస్తకాలు రచించిన శామ్యూల్ లాంఘోర్న్ క్లెమెన్స్‌కు కూడా పెద్దగా చదుదుకోలేదు. కానీ అతను 12 ఏళ్ల వయసులోనే పాఠశాలను విడిచిపెట్టి పబ్లిక్ లైబ్రరీలలో చదువుకున్నాడన్నారు. కేవలం డిగ్రీలు చేస్తే అది విద్య కాదని తన ఎదుగదలకు, దేశ భవితవ్యానికి ఉపయోగపడేదే నిజమైన విద్య అని చ్పెపారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP
— Ashok Swain (@ashoswai) March 24, 2023
(చదవండి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత)
Comments
Please login to add a commentAdd a comment