![India, Bangladesh get triple-layer security for IND vs BAN 1st T20I in Gwalior](/styles/webp/s3/article_images/2024/10/4/bangladesh.jpg.webp?itok=fPe09vPd)
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.
అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.
తుది జట్లు అంచనా
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్
Comments
Please login to add a commentAdd a comment