అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మహిళా జడ్జి చేసిన ఆరోపణలపై మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన కమిటీ వ్యవహారాలపై అత్యున్నత ధర్మాసనం స్టే విధించింది.
మధ్యప్రదేశ్లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి తనను లైంగికంగా వేధించారని గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఓ మహిళ ఇటీవల సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు.