Madhya Pradesh High Court
-
నోరు పారేసుకున్న మంత్రిపై ఎఫ్ఐఆర్
జబల్పూర్: పాకిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’గురించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, దేశ ప్రజలకు ఎప్పుకప్పుడు సమాచారం అందించిన మహిళా సైనికాధికారి, కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహిళా అధికారిని కించపర్చేలా మాట్లాడిన విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ విషయం తమకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా మంగళవారం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు. అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పారీ్టలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రివర్గం నుంచి తొలగించాలివిజయ్ షాను తక్షణమే మధ్యప్రదేశ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. విజయ్ షా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనొక మూర్ఖుడు అని మండిపడ్డారు. బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ్ షా అభ్యంతకర వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఖండించారు. మహిళా అధికారి గురించి అలా మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కార్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులను గౌరవించాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అనుచితంగా మాట్లాడడాన్ని సహించబోమని హెచ్చరించారు. పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం: విజయ్ షా తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతుండడంతో విజయ్ షా బుధవారం స్పందించారు. ఎవరైనా బాధపడి ఉంటే ఒకటి కాదు పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని చెప్పారు. -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్ సల్మాన్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్ సల్మాన్ ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025 -
యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను 6 వారాల్లోగా తొలగించండి
భోపాల్: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాల తొలగింపుపై మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల గడువిచ్చింది. పితంపూర్‌లోని వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్‌లో వీటిని భద్రతా ప్రమాణాలకు లోబడి శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ విషయమై ఎలాంటి అసత్య వార్తలను వార్తలను ప్రసారం చేయరాదని కూడా ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాను ఆదేశించింది. మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపుపై తప్పుడు, నిరాధార వార్తలు ప్రసారం కావడంతో పితంపూర్ వాసులు తీవ్ర నిరసనలకు పూనుకోవడం తెలిసిందే. జనవరి 2వ తేదీన మూతబడిన కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాలను 12 సీల్డ్ కంటెయినర్లలో భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని పితంపూర్కు తరలించారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ కంటెయినర్లలోని వ్యర్థాలు అలాగే ఉండిపోయాయి. వీటిని ట్రక్కుల నుంచి కిందికి దించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, భద్రతా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ముందుగా ఆ వ్యర్థాల్లోని విష రసాయనాలు ఎంత మేరకు ప్రమాదకరమో పరీక్షించి, ఆ నివేదికను బహిరంగ పరుస్తామని, ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొడతామని తెలిపారు. -
నెలసరి పురుషులకూ వస్తే తెలిసేది!: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఓ మహిళా జడ్జికి గర్భస్రావం అయిన పరిస్థితిని కనీస పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుమోటోగా విచారణ జరుపుతోంది. అయితే..ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఊరట దక్కని ఇద్దరు.. ఎంత విజ్ఞప్తి చేసినా ఉన్నత న్యాయస్థానం వినలేదు. అయితే.. ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతోపాటు తన సోదరుడు క్యాన్సర్ బారినపడినట్లు హైకోర్టు ధర్మాసనం ముందు వివరణ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ నాగరత్న, ఎన్కే సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మంగళవారం విచారణ జరిపింది.‘‘ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంది. పురుషులకూ నెలసరి వస్తే ఆ సమస్య ఏంటనేది తెలిసేది’’ అని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సివిల్ జడ్జీల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. -
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
హీరోయిన్ కరీనా కపూర్ పై సీరియస్ !..నోటీసులు జారీ చేసిన కోర్టు..
-
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్‌ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఐటెం సాంగ్’ ఆరోపణలు.. మహిళా జడ్జికి భారీ ఊరట
హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్‌కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. 2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. ఏం జరిగిందంటే.. జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది. ఓ ఐటెం సాంగ్‌లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. -
లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?!
సాక్షి, న్యూఢిల్లీ: లైంగికదాడి కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలంటూ నిబంధన విధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ ఇచ్చే ఇలాంటి ఆదేశాలతో వేధించిన వ్యక్తిని సోదరుడిగా మార్చినట్లయిందని వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను తప్పుపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి కేసుల విచారణ సమయంలో జడ్జీలు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లైంగిక దాడి బాధితుల గత ప్రవర్తన, వారి వస్త్ర ధారణ, వారి పరస్పర విరుద్ధ వైఖరుల వంటి వాటిని తీర్పులిచ్చే సమయంలో ప్రస్తావించరాదని స్పష్టం చేసింది. ‘బెయిల్ దరఖాస్తుదారు తన భార్యాసమేతంగా 2020 ఆగస్టు 3వ తేదీ ఉదయం11 గంటలకు బాధితురాలి ఇంటికి రాఖీ, స్వీట్లు తీసుకుని వెళ్లాలి. ఆమెతో రాఖీ కట్టించుకుని, అన్ని వేళలా రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు అక్రమమంటూ 9మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది. ఇటువంటి తీర్పులు కేసు తీవ్రతను ముఖ్యంగా లైంగిక వేధింపుల విషయంలో తక్కువ చేస్తాయని పేర్కొంది. చట్టం ప్రకారం బాధితురాలిపై జరిగిన నేరం.. క్షమాపణలు, సామాజిక సేవ, రాఖీ కట్టించుకోవడం, బహుమతుల ద్వారానో, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ద్వారా సమసిపోయే చిన్న తప్పు కాదని తెలిపింది. ఇటువంటి విషయాలపై జడ్జీలు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవగాహన కల్పించాలని బార్ కౌన్సిల్‌కు సూచించింది. చదవండి: మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఆ సిఫారసును వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం.. జస్టిస్ విక్రమ్‌నాథ్ స్థానంలో జస్టిస్ జె.కె.మహేశ్వరిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసిన కొలీజియం తన సిఫారసును కేంద్రానికి పంపింది. -
‘సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి’
జబల్పూర్: క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘సచిన్ భారతరత్న అవార్డు ద్వారా లభించిన గౌరవాన్ని పలు వ్యాపార ఒప్పందాలకు వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాడని’ ఆరోపిస్తూ భోపాల్‌కు చెందిన వి.కె. నస్వాహ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం స్వీకరించింది. భారతరత్న గ్రహీతలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. నస్వాహ్ తన పిటిషన్లో ‘సచిన్ క్రికెట్లో దేశానికి రికార్డులు సాధించి పెట్టాడు. అయితే భారతరత్న ద్వారా ఖ్యాతితో పలు వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం చేసి, డబ్బు సంపాదిస్తున్నాడు’ అని ఆరోపించారు. -
సచిన్ భారతరత్నపై పిటిషన్
జబల్పూర్: క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఇచ్చిన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును వెనక్కు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాణిజ్యపరమైన ప్రకటనల్లో నటిస్తూ భారీ మొత్తంలో ధనాన్నిసంపాదిస్తున్న సచిన్ కు భారతరత్న అవార్డు ఇవ్వడం సబబు కాదంటూ వికే నాస్వా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కార్, జస్టిస్ కేకే త్రివేదీలతో కూడిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. భారతరత్న అవార్డును వెనక్కు తీసుకోవడానికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారంలోగా తెలియజేయాలని పేర్కొంటూ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. క్రికెట్ లో భారత్ కు ఎనలేని సేవలందించిన సచిన్ అనేక అవార్డులు కూడా తన పేరటి లిఖించుకున్నా.. కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారతరత్న అవార్డుకు అగౌరవం తెస్తున్నాడంటూ ఏకే నాస్వా పిటిషన్ లో పేర్కొన్నాడు. భారత ప్రభుత్వం సచిన్ కు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యానని భావిస్తే ఆ అవార్డును తిరిగి అతనే స్వచ్ఛందంగా వెనక్కు ఇవ్వాలని నాస్వా డిమాండ్ చేశాడు. -
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మహిళా జడ్జి చేసిన ఆరోపణలపై మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన కమిటీ వ్యవహారాలపై అత్యున్నత ధర్మాసనం స్టే విధించింది. మధ్యప్రదేశ్‌లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి తనను లైంగికంగా వేధించారని గ్వాలియర్‌లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఓ మహిళ ఇటీవల సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ జడ్జి తనను ఓ ఐటెం సాంగ్‌కు డాన్సు చేయమన్నారని ఆమె ఆరోపించారు. ఆ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారని ఆమె తెలిపారు.