‘సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి’ | Plea to revoke Sachin's Bharat Ratna admitted | Sakshi
Sakshi News home page

‘సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి’

Published Sat, Jun 20 2015 5:52 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

‘సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి’

‘సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి’

జబల్‌పూర్: క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘సచిన్ భారతరత్న అవార్డు ద్వారా లభించిన గౌరవాన్ని పలు వ్యాపార ఒప్పందాలకు వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాడని’ ఆరోపిస్తూ భోపాల్‌కు చెందిన వి.కె. నస్వాహ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం స్వీకరించింది. భారతరత్న గ్రహీతలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు  ఏవైనా ఉన్నాయేమో పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.

నస్వాహ్ తన పిటిషన్‌లో ‘సచిన్ క్రికెట్‌లో దేశానికి రికార్డులు సాధించి పెట్టాడు. అయితే భారతరత్న  ద్వారా ఖ్యాతితో పలు వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం చేసి, డబ్బు సంపాదిస్తున్నాడు’ అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement