గ్వాలియర్ : అప్పటికే వాజ్‌పేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్‌లో సైకిల్‌పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజ్‌పేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజ్‌పేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు. ‘గతంలో అటల్‌జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్‌తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్‌కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్‌పేయి ఇష్టపడేవారు.
Comments
Please login to add a commentAdd a comment