
భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవిదేశాల నుంచి నేతలు, అభిమానులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వాజ్‌పేయితో కలిసిఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 1999లో అఖిలేష్-డింపుల్ వివాహానికి హాజరైన వాజ్‌పేయి ఫోటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన మహానేత, పార్టీ సిద్దాంతాలను పాటిస్తూనే వ్యక్తిత్వాన్ని మరిచిపోని గొప్పనేత వాజ్‌పేయి. ఆయన మాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు మార్గనిర్దేశి. ఆయన మరణంతో ప్రపంచం గొప్ప నాయకున్ని, రచయితను, గొప్ప వక్తను కోల్పోయాం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.
వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల, బీజేపీ ఆగ్రనేతలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
स्व. अटल जी ने राजनीति को दलगत राजनीति से ऊपर उठाया, सदैव अपने दल के सिद्धांतों व अपने दर्शन पर अडिग रहना सिखाया, जब भी राजनीति भटकी उसको सही मार्ग दिखाया, विदेशों से मित्रता का पाठ पढ़ाया. अटल जी का जाना भारतीय राजनीति एवं साहित्यिक जगत के मुखरित स्वर का मौन हो जाना है. मौन नमन! pic.twitter.com/1w4EOgr9qG
— Akhilesh Yadav (@yadavakhilesh) August 17, 2018