భోపాల్: మహిళలు చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 'గోల్ ఇన్ శారీ' పేరుతో ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. 20-72 ఏళ్ల మధ్య వయసున్న 8 మహిళా జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ చీరకట్టులోనే తమ నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు.
గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. చైత్ర నవ్‌రాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈపోటీలు నిర్వహించారు. ఇంత మంది మహిళలు చీరలు ధరించి ఫుట్‌బాల్ ఆడటం దేశంలో బహుశా ఇది తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. చీరకట్టులోనూ ఫుట్‌బాల్ ఆడి సత్తాచాటారని కొనియాడారు.
म्हारी महिलायें क्या #मेसी से कम हैं.. ग्वालियर में महिलाओं ने साड़ी वेशभूषा में फुटबॉल खेली। pic.twitter.com/Hi6PmTJp2i
— Brajesh Rajput (@brajeshabpnews) March 27, 2023
ఈ వీడియోను చూసిన వారు బెండ్ ఇట్ లైక్ బెక్‌హాం మూవీలో ఓ యువతి క్యారెక్టర్ గుర్తుకువస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా యువతికి ఫుట్‌బాల్ ఆడాలని కలలు కంటుంది, కానీ సంప్రదాయ కుంటుంబానికి చెందిన పెద్దలు అందుకు ఒప్పుకోరు. కానీ సంప్రదాయ పద్ధ తులను పాటిస్తూనే యువతి తన కలను నెరవేర్చుకునే విధానం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!
Comments
Please login to add a commentAdd a comment