
చెట్లే జీవనాధారం : ఎమ్మెల్యే
వృక్షోరక్షతీ రక్షితః అన్నట్లు చెట్లను పెంచితే అవి మనల్ని రక్షిస్తాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
రామన్నపేట
వృక్షోరక్షతీ రక్షితః అన్నట్లు చెట్లను పెంచితే అవి మనల్ని రక్షిస్తాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయ ఆవరణల్లో మొక్కలను నాటారు. వృక్షాలు పర్యావరణ పరిరక్షణతో పాటు, కరువును జయించడానికి దోహదపడతాయనీ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, తహసిల్దార్ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, సర్పంచ్ నకిరేకంటి మొగులయ్య, ఎంపీటీసీలు ఆకవరపు మధుబాబు, ఊట్కూరి శోభ, సాల్వేరు లింగం, ఎపీఓ ఈశ్వర్, సూపరిండెంట్ లలిత, సీనియర్‌అసిస్టెంట్‌లు చంద్రశేఖర్, ఆర్‌వీ సత్యనారాయణ టీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు, పంచాయతీ, రెవిన్యూకార్యదర్శులు పాల్గొన్నారు.