సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మరో వైపు చెట్లను నరికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ పక్కన గల పెంగ్విన్ స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి ముక్కలు చేసుకుని ఆటోలో తీసుకువెళుతున్నారు. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు నరికిన కలపను స్వాధీనం చేసుకున్నారు.
విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఓ వైపు హరిత హార ద్వారా చెట్లను నాటుతుంటే మరో వైపు కొందరు తమ స్వప్రయోజనాల కోసం ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇటీవల అదిలాబాద్ పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment