
నవ దంపతులతో ఎమ్మెల్యే నరసింహన్
తమిళనాడు, పళ్లిపట్టు: వారిద్దరూ నవదంపతులు.. కల్యాణ వేదిక సాక్షిగా తమను ఆశీర్వదించేందుకు వచ్చిన వారికి మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించారు. తిరుత్తణి గాంధీరోడ్డు మార్గం వీధిలో నివాశముంటున్న వినాయకం అన్నాడీఎంకే కార్యకర్త. చిన్న వయస్సు నుంచే సమాజ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గనేవారు. ఐదుగురు తోబుట్టువులు, అక్క చెళ్లెలు ఉండడంతో ఆలస్యంగా వివాహం కుదిరింది. నాలుగు రోజుల కిందట సుందరవల్లితో వివాహం జరిగింది. తమ కల్యాణోత్సవం ద్వారా ప్రజలకు మంచి విషయం చెప్పాలని వినాయకం నిర్ణయించుకున్నారు. అదేతడవుగా వేదికపైన నవ దంపతులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు ‘మెక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అని రాసిన బ్యాగ్‌లను అందజేశారు. వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నరసింహన్ వారి ఆలోచనను ప్రోత్సహించి సత్కరించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సైతం శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment