తాడికొండ(గుంటూరు): అమరావతి రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం, తాళ్లయిపాలెం మధ్య ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో దారిలో రెండు వైపులా ఉన్న తాటిచెట్లకు పసుపు రంగు వేశారు. బెజవాడ సత్యనారాయణ పొలంలో ఈనెల 6వ తేదీన భూమిపూజ చేసే ప్రాంతంలో షెడ్డు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగించనున్న సభాప్రాంగణాన్ని దాదాపుగా పూర్తిచేశారు. పదెకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సమీపంలో ఐదెకరాల దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు కాన్వాయ్ వచ్చేందుకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు.