నిర్మల్, న్యూస్‌లైన్ : నిర్మల్ పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోయి. ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. అరగంటకు పైగా కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు పట్టణంలోని ఈదిగాంలో భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. ఇదే రోడ్డుపై రెండు చోట్ల, తహశీల్దార్ కార్యాలయం ఎదుట చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బేస్తవార్‌పేట్‌లో చెట్టు పడిపోయింది. నాయిడివాడ తదితర కాలనీల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. భాగ్యనగర్, ఈదిగాం తదితర ప్రాంతాల్లో తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ఈదిగాం, అథర్‌గల్లీ, నాయిడివాడ, తదితర చోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోవడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి.
కలెక్టర్ వాహనంపై విరిగిపడిన చెట్టు కొమ్మ
అటవీశాఖ మంత్రి జోగు రామన్న విశ్రాంతి భవనంలో బస చేసిన సమయంలోనే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో అధికారులు, నాయకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. భారీ గాలులకు విశ్రాంతి భవనం ఆవరణలోని చెట్లన్నీ ఊగుతూ కొమ్మలు విరిగిపడ్డాయి. కలెక్టర్ వాహనంపై ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న వాహనాలన్నీ బయటకు తీశారు.
నిర్మల్‌లో భారీ వర్షం
Published Thu, Jun 5 2014 12:53 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement