నిర్మల్‌లో భారీ వర్షం
Published Thu, Jun 15 2017 2:20 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
నిర్మల్: జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాల చౌరస్తా, శివాజీ చౌక్‌లు చెరువును తలపిస్తున్నాయి. భారీ వర్షంతో పాటు పట్టణ కేంద్రంలో రెండు చోట్లు పిడుగులు పడ్డాయి.
రైల్వే స్టేషన్ సమీపంలో పిడుగుపాటు
భారీ వర్షం కారణంగా బాసర రైల్వేస్టేషన సమీపంలో పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందో తెలియని ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు.
Advertisement
Advertisement