వనపర్తి టౌన్: గొడ్డలి వేటుకు గురికావాల్సిన 8 చెట్లకు పునరుజ్జీవం వచ్చింది. వనపర్తి జిల్లాలోని నాగవరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పక్కనున్న చెట్లను నరికివేయకుండా ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట నాటాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. దీంతో అధికారులు హైదరాబాద్‌కు చెందిన ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ఉప్పలయ్యను సంప్రదించారు. మొత్తం 12 చెట్లకు 8 చెట్లు మరోచోట నాటితే బతుకుతాయని చెప్పారు. దీంతో 4 రోజుల క్రితం చెట్ల చుట్టూ 5 అడుగుల గోతి తీసి.. ఫిట్టింగ్ బెల్డ్ సహాయంతో గోనెసంచుల్లో వేర్లు బయటికి రాకుండా మట్టితో బిగుతుగా కట్టి రసాయనిక మందులు పూశారు. అనంతరం శివారులోని ఖాళీ స్థలంలో వాటిని నాటారు.
Comments
Please login to add a commentAdd a comment