వర్షార్పణమే..
Published Tue, May 2 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
రాజవొమ్మంగి :
జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కురిసిన భారీ వర్షం కురిసింది. రాజవొమ్మంగి, గోకవరం, జగ్గంపేట, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. రాజవొమ్మంగిలో చెట్టుకొమ్మలు విద్యుత్ లైన్లపై పడి వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటలకు కానీ విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించలేమని ట్రా¯Œ్సకో ఏఈ మాగంటి దొరబాబు తెలిపారు. అడ్డతీగల– వేటమామిడి మధ్య చెట్లు పడిపోవడంతో ప్రధాన విద్యుత్‌లైన్లు తెగిపడ్డాయన్నారు. ఏలేశ్వరం సమీపంలో 33/11 కేవీ లై¯ŒS దెబ్బతిన్నట్టు చెప్పారు. రాజవొమ్మంగికి కొన్ని గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా లోతట్టు గ్రామాలకు విద్యుత్ అందించేందుకు సమయం పడుతుందన్నారు. నర్సీపట్నం–దేవీపట్నం రహదారిపై పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డా రు. భారీ కొబ్బరి చెట్టు మీద పడడంతో దూసరపాము గ్రామంలోని పెదపూడి ఏసు బాబు తాటాకిల్లు, రిక్షా దెబ్బతిన్నాయి. మండలంలోని కొండపల్లి, లాగరాయి తదితర గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది.
పాడి ఆవు మృతి
రాజవొమ్మంగిలోని ఈదురుగాలులకు సమీపంలో ఓ భారీ తాటిచెట్టు కూలిపోయింది. అదే సమయంలో మేతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న పాడి ఆవుపై ఈ తాటిచెట్టు పడడంతో ఆవు అక్కడికక్కడే మరణించింది. రూ.10వేలకు పైగా విలువైన పాడి ఆవు మరణించడంతో యజమాని పెదపూడి నాగరాజు (దూసరపాము) నష్టపోయాడు. జడ్డంగి గ్రామంలోని ఎస్సీపేటలో చెట్టుకూలిపోవడంతో పేకేటి రాంబాబు వంటిషెడ్డు దెబ్బతింది. ఈదురుగాలుల కారణంగా మామిడితోటలకు నష్టం వాటిల్లింది. పక్వానికి వస్తున్న మామిడి పండ్లు వడగళ్ల వానకు, ఈదురుగాలులకు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది.
Advertisement