చెట్లు నరకొద్దు...మెట్రో లైన్ మార్చండి | Mumbai Metro-3 project work to begin by March next | Sakshi
Sakshi News home page

చెట్లు నరకొద్దు...మెట్రో లైన్ మార్చండి

Published Wed, Mar 11 2015 11:21 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Mumbai Metro-3 project work to begin by March next

సాక్షి, ముంబై: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎమ్మెమ్మార్సీ) తలపెట్టిన కొలాబా-బాంద్రా సీబ్జ్ మెట్రోలైన్-111 నిర్మాణంలో భాగంగా చర్చ్‌గేట్‌లోని చెట్ల నరికివేతను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొలాబా-బాంద్రా-సీబ్జ్ మెట్రోలైన్-111 కోసం చర్చ్‌గేట్‌లోని జే టాటా రోడ్ వద్ద 73 చెట్లను తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. తాము పుట్టినప్పటి నుంచి చెట్లను చూస్తున్నామని, మెట్రో నిర్మాణం కోసం చెట్లను నరికివేయకుండా గతేడాది డిసెంబర్ నుంచి ఎమ్మెమ్మార్సీకి లేఖలు రాస్తున్నామని స్థానికులు తెలిపారు.

జేజే టాటా సర్కిల్ వద్ద  భూగర్భ మార్గాలను నిర్మిస్తున్నారని, పనుల్లో భాగంగా అక్కడ నిర్వహించే డ్రిల్లింగ్‌కు పురాతన భవనాలు ఎలా తట్టుకోగలవని ప్రశ్నించారు. మెట్రో లైన్‌ను మరో చోటికి మార్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెమ్మార్డీఏ అధికారులు మాట్లాడుతూ.. కొలాబా-బాంద్రా సీప్జ్ మెట్రో మార్గంకు దాదాపు 589 చెట్ల అడ్డు వస్తున్నాయన్నారు. వీటిని నరికివేయడం ద్వారా 32,977 కి.లోల ఆక్సీజన్ తగ్గుతుందని, ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు దాదాపు 1,000 మొక్కలను నాటేందుకు నిర్ణయించామని ఎమ్మెమ్మార్డీ అధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement