వాషింగ్టన్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సారి వేడుకలో చరిత్రను తిరగరాస్తూ భారత్ రెండు ఆస్కార్‌లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా హాలీవుడ్ పాటలను సైతం వెనక్కి నెట్టి అవార్డును ఎగరేసుకుపోగా.. బెస్ట్ డ్యాకుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ ఆస్కార్‌ను కూడా నీటుగా దక్కించుకుంది. సంచలనంగా మారి ఈ పాటకు తాజాగా యూఎస్ పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నాటు నాటు .. ఎక్కడ చూసిన ఇదే
ఏ ముహార్తాన ‘నాటు నాటు’ పాట విడుదలైందో గానీ ప్రపంచవ్యాప్తంగా అందరి చేత స్టెప్పులు వేయిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కూడా తన బుట్టలో వేసుకుంది. తాజాగా ఓ వీడియోలో.. హోలీ జరపుకుంటుండగా ఇద్దరు పోలీసులు నాటు నాటు స్టెప్పులు వేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. వారు ఎంత ప్రయత్నించినా డ్యాన్స్ వేయలేకపోతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసుల దగ్గరకు వచ్చి ఎలా వేయాలో నేర్పుతుంటాడు. ఆ వ్యక్తి పోలీసుల భుజాలపై చేతులు వేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఈ స్టెప్‌ని వేసి చూపిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నాటు నాటు స్టెప్పులు అంత ఈజీ కాదమ్మా అని కామెంట్లు పెడుతున్నారు.
#California cops are enjoying the the #NaatuNaatu song.🙌🙌🤙🤙 Naatu naatu is everywhere #RamCharan #NTR #RRRMovie #SSRajamouli #RRRForOscars #RRR #GlobalStarRamCharan #NTRGoesGlobal #Oscars #Oscars2023 #letsdance pic.twitter.com/rjRQMrjoTs
— nenavath Jagan (@Nenavat_Jagan) March 11, 2023
Comments
Please login to add a commentAdd a comment