My Dear Bootham: Prabhudeva Master Oh My Master Video Song Out Now - Sakshi
Sakshi News home page

My Dear Bootham: మాస్టర్‌ ఓ మై మాస్టర్‌ సాంగ్‌లో ప్రభుదేవా డ్యాన్స్‌ చూశారా?

Published Thu, Jun 23 2022 8:12 PM | Last Updated on Thu, Jun 23 2022 8:49 PM

My Dear Bootham: Prabhudeva Master Oh My Master Video Song Out Now - Sakshi

ప్రభు దేవా ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా 'మై డియర్ భూతం'. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్‌‌తో సాగిపోతున్న ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అరవింద్ అన్నెస్ట్ పాడిన ఈ పాటకు డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ మార్చేశాయి.

ఇకపోతే ఈ సినిమాలో రమ్య నంబీసన్, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

చదవండి: వారం రోజులుగా ఆస్పత్రిలో దర్శకుడు, పరిస్థితి విషమం
బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ, అప్పుడే మరో ఛాన్స్‌ కొట్టేసిందిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement