
తమిళసినిమా: జీవితంలో ఎత్తుపల్లాలు ఎవరికైనా సర్వసాధారణం. కొందరికి కాలం కలిసిరాకపోవడం లాంటివి, మరికొందరికి స్వయంకృతాపరాధం కారణం అవుతుంది. వీటిలో ఏ కారణంగానో ఇంతకుముందు టాప్ హీరోయిన్ల రేస్‌లో ఉన్న నటి హన్సిక కాస్త వెనుక పడిపోయింది. బహుశా ఆ మధ్య తాను నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం అయిఉండవచ్చు. ఏదేమైనా బోగన్ చిత్రం తరువాత హన్సికను కోలీవుడ్ తెరపై చూడలేదు. దీంతో హన్సిక పనైపోయింది. ముంబైకి మూటాముల్లె సర్దేసింది అనే ప్రచారం మొదలైంది. ఇలాంటి సమయంలో డాన్సింగ్ స్టార్ ప్రభుదేవాతో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. చాలా సైలెంట్‌గా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పొంగల్ రేస్‌కు సిద్ధమైంది. మళ్లీ హన్సిక భవిష్యత్తును నిర్ణయించే చిత్రం ఇదే అనే ప్రచారం సాగింది. అయితే నటుడు అధర్వతో జతకట్టే అవకాశం హన్సిక తలుపు తట్టింది. ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుండగా తాజాగా మరో అవకాశం హన్సికను వరించింది. ఈ సారి యువ నటుడు విక్రమ్‌ప్రభుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. దీనికి తుపాకీ మునై అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఇంతకు ముందు విజయ్ హీరోగా తుపాకీ, రజనీకాంత్ నటించిన కబాలి వంటి భారీ చిత్రాలను నిర్మించిన వి.క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దినేష్ సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా రాస్‌మది ఛాయాగ్రహణం, ఎల్‌వీ.ముత్తు సంగీతాన్ని అందిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. లేవు లేవు అంటూనే మళ్లీ ప్రైమ్‌టైమ్‌లోకి వచ్చేన నటి హన్సిక వరుసగా చిత్రాలు చేస్తూ మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయిపోతోంది. అన్నట్టు ఈ అమ్మడు ఈ చిత్రం కోసం 6 కిలోల బరువు తగ్గి మరింత స్లిమ్‌గా తయారైందట. దీని గురించి హన్సిక తెలుపుతూ చిత్ర దర్శకుడు ముంబై వచ్చి కథను వినిపించారని, కథ తనను చాలా ఇన్‌స్పైర్ చేసిందని చెప్పింది. ఇది రెగ్యులర్ పాత్రల్లా ఉండదని, తానింత వరకూ చేయనటువంటి పాత్ర అని చెప్పింది. ఇక విక్రమ్‌ప్రభు ఇందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించనున్నారట. ఆయన ఇంతకు ముందు ఇదే బ్యానర్‌లో అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రంలో నటించారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment