
3న ప్రభుదేవా స్టూడియోస్ ప్రారంభం
ప్రభుదేవా స్టూడియోస్ చిత్ర నిర్మాణ రంగంలోకి ముమ్మరంగా అడుగుపెట్టనుంది. ప్రభుదేవా ఈ పేరు సినీ నృత్యానికి చిరునామాగా మారింది.
ప్రభుదేవా స్టూడియోస్ చిత్ర నిర్మాణ రంగంలోకి ముమ్మరంగా అడుగుపెట్టనుంది. ప్రభుదేవా ఈ పేరు సినీ నృత్యానికి చిరునామాగా మారింది. ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా ప్రాచుర్యం పొందారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి దర్శకుడిగా విజయఢంకా మోగించిన దర్శకుల్లో ఈయన ఒకరు. నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ఈ మూడు రంగాల్లోనూ సక్సెస్ అయిన ప్రభుదేవా తాజాగా నిర్మాతగా మారనున్నారు. ప్రభుదేవా స్టూడియోస్ బ్యానర్‌ను నెలకొల్పి తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ చిత్రాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో టాలెంట్ కు కొదవలేదన్నారు. అలా కొత్తగా వస్తున్న యువ కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేలా చిన్నా, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అంతర్జాతీయ స్థాయి చిత్రాలను నిర్మించాలన్నదే తన ధ్యేయం అన్నారు. అలాగే మంచి అనుభవం గల కళాకారులు, సాంకేతిక వర్గంతో క్వాలిటీ చిత్రాలు నిర్మిస్తానని తెలిపారు. మూడవ తేదీన అధికారిక పూర్వకంగా ప్రభుదేవా స్టూడియోస్ బ్యానర్‌ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.