
తమిళసినిమా: నటుడు సూర్యతో ఢీ కొట్టేందుకు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సిద్ధం అవుతున్నారు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎన్‌జీకే. రకుల్‌ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఆర్‌ఎస్ ప్రకాశ్, ఆర్‌ఎస్ ప్రభు నిర్మించారు.ఈ చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది.సెల్వరాఘవన్ దర్శకత్వంలో చిత్రం అంటేనే సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, దర్శకుడు విజయ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన దేవి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో టైటిల్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించింది.ఇదే కాంబినేషన్‌లో దేవి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సైతం మే 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ విధంగా సూర్య, ప్రభుదేవాలు ఒకే రోజున బరిలో దిగనున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment