ఫస్టాఫ్‌లో హీరో.. సెకండాఫ్‌లో విలన్ | Sri Raghava About Suriya NGK Movie | Sakshi
Sakshi News home page

ఫస్టాఫ్‌లో హీరో.. సెకండాఫ్‌లో విలన్

Jun 2 2019 6:30 PM | Updated on Jun 2 2019 6:37 PM

Sri Raghava About Suriya NGK Movie - Sakshi

'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన శ్రీ రాఘవ దర్శకత్వంలో వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ 'ఎన్ జీ కే'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు.

మే 31న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సందర్భంగా డైరెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘సూర్య ఫస్టాఫ్‌లో హీరో, సెకండాఫ్‌లో విలన్‌గా క్యారెక్టరైజేషన్‌ను డిఫరెంట్‌గా చేశాము. అదే ‘ఎన్‌జీకే’ చూసిన ఆడియెన్స్‌ను థ్రిల్‌ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్‌కు ట్రెమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది. సూర్య తో డిఫరెంట్ క్యారక్టర్ చేయించారని అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 'ఎన్జీకే' సాధించిన విజయం అటు సూర్యకి దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది.  ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement