ఖాకీ తొడిగి... లాఠీ పట్టి | prabhudeva will act as police officer | Sakshi
Sakshi News home page

ఖాకీ తొడిగి... లాఠీ పట్టి

Published Sun, May 20 2018 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

prabhudeva will act as police officer  - Sakshi

ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సెక్షన్స్‌ గురించి డీప్‌గా తెలుసుకుంటున్నారు ప్రభుదేవా. అదేంటీ.. ఆయనది సినిమా సెక్షన్‌ కదా అంటే నిజమే. సినిమా కోసమే ఐపీసీ సెక్షన్స్‌ తెలుసుకుంటున్నారు. ఇంకా అర్థం కాలేదా? తన నెక్ట్స్‌ సినిమాలో ఆయన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి, తూటా పేల్చి.. అన్యాయాన్ని ప్రభుదేవా ఎలా అరికడతాడు? అన్న విషయం తెలుసుకోవడానికి చాలా టైమ్‌ ఉంది. అన్నట్లు ఈ సినిమాకు దర్శకుడు ఎవరనుకున్నారు? ప్రభుదేవా తమిళ్‌లో డైరెక్ట్‌ చేసిన ‘పోకిరి, విల్లు’ చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన ఏసీ. ముగిల్‌. కెరీర్‌లో ప్రభుదేవా పోలీసాఫీసర్‌గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే. నేమిచంద్‌ జబాక్‌ నిర్మించనున్నారు. ‘‘ఫ్యామిలీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందీ చిత్రం’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement