
నిరాశపరచిన నయనతార
ధనుష్, నయనతారలది హిట్ పెయిర్. యారడీ నీ మోహినీ చిత్రంలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. చిత్రం హిట్ అయ్యింది. మరో విషయం ఏమిటంటే నటుడు ధనుష్‌కు ఈ మధ్య సరైన సక్సెస్ లేదు. మయక్కం ఎన్న, 3, మరియాన్, నైయాండి వరుసగా ఆయన్ని నిరాశపరిచారుు. మధ్యలో హిందీ చిత్రం రంజనా విజయబాట పట్టినా తమిళంలో అంబికాతి విడుదలై అనువాద చిత్ర ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ధనుష్‌కు మంచి హిట్ కావలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇప్పుడాయన బాలీవుడ్‌లో బాల్కి దర్శకత్వంలో ఒక చిత్రం తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేకన్ చిత్రంతోపాటు కెమెరామన్ వేల్‌రాజ్ దర్శకత్వంలో వేలైఇల్లాద పట్టదారి చిత్రంలోనూ నటిస్తున్నారు.
తాజాగా సురాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ గా నయనతార బాగుంటుందని దర్శకుడితోపాటు ధనుష్ భావించారట. యారడి నీ మోహిని హిట్ అవడంతో ధనుష్‌తో మరోసారి జతకట్టడానికి నయనతార కూడా ఒకే అందట. పారితోషికం విషయంలో చర్చలు జరుగుతుండగా ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా చిత్రంలో నటించే అవకాశం నయనతారను వరించింది. ఈ చిత్రానికి పారితోషికం కూడా మెండుగా లభించడంతో డబ్బెవరికి చేదు పిచ్చోడా అన్న చందంగా సురాజ్ చిత్రానికి మొండి చెయ్యి చూపించి ఉదయనిధి స్టాలిన్ చిత్రానికి కమిట్ అయిపోయింది. ఇది దర్శకుడు సూరజ్‌కు షాక్ నిచ్చి నా ధనుష్‌ను మాత్రం చాలా నిరాశపరిచిందని సమాచారం.