నేనూ సాధారణ మహిళనే | iam a simple women says actress nayana tara | Sakshi
Sakshi News home page

నేనూ సాధారణ మహిళనే

Published Wed, May 6 2015 6:21 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

నేనూ సాధారణ మహిళనే - Sakshi

నేనూ సాధారణ మహిళనే

ను సాధారణ స్త్రీనే అని అంటున్నారు సంచలన తార నయనతార. అయితే చాలామంది నటీమణులు వ్యక్తిగత జీవితాలకు భిన్నం ఈమె జీవితం అని చెప్పవచ్చు.

బెంగళూరు: నేను సాధారణ స్త్రీనే అని అంటున్నారు సంచలన తార నయనతార. అయితే చాలామంది నటీమణులు వ్యక్తిగత జీవితాలకు భిన్నం ఈమె జీవితం అని చెప్పవచ్చు. కారణం నయన నిజ జీవితం తెరచిన పుస్తకం. అందులో చాలా పుటలు, పలువురికి సుపరిచయమే. తొలుత మాతృభాష మలయాళంలో రెండు చిత్రాలు చేశారు. ఆ తరువాత అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమెకిక్కడ తొలి చిత్రంతోనే విజయాహ్వానం లభించింది.

ఆ తరువాత గజని చిత్రంలో అందాలారబోసినా ( ఒకపాటలో) ఆ చిత్ర విజయాన్ని నటి ఆసిన్ కొట్టేశారు. ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖి, శింబుకు జంటగా నటించిన వల్లవన్ చిత్రాలు నయన్ స్థాయిని పెంచాయనే చెప్పాలి. అలా ఒక్కోమెట్టూ ఎక్కుతూ నటిగా బలపడుతున్న సమయంలో నటుడు శింబుతో ప్రేమాయణం ఆమెను సంచలన నటిని చేసింది. అలా మంచి డీప్‌కు చేరిన శింబుతో ప్రేమ మనస్పర్థల కారణంగా బద్దలైంది. ఆ  సంఘటనలు నయన్‌ను కోలీవుడ్‌లో నిలువ నీయకుండా చేశాయి. అదే సమయంలో టాలీవుడ్ తలుపులు తెరిచింది. అక్కడ లక్ష్మీ తదితర చిత్రాలు విజయాలు గత చేదు అనుభవాలను మరిచేలా చేశాయి. అంతేకాదు శ్రీరామరాజ్యం వంటి గొప్ప కళాఖండంలో మహా సాద్వి సీతమ్మ పాత్రలో నటించే భాగ్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కలిగించింది.

అయితే అదే సమయంలో నృత్య దర్శకుడు ప్రభుదేవాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆ ప్రేమ ఫెయిల్ అయ్యింది. సుమారు రెండేళ్ల పాటు నటనకు దూరం అయిన నయనతార మళ్లీ నటనపై దృష్టి సారించడం, ఆమెను మరోసారి తమిళ పరిశ్రమ ఆదరించడం అనేది బహుశా ఆమె కూడా ఆశించి ఉండదు. ప్రస్తుతం ప్రముఖ కథానాయికగా ప్రకాశిస్తున్న నయన ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గత ప్రేమలు, అవి విఫలమైన విషయాల గురించి ప్రశ్నలు విలేకరుల నుంచి ఎదురయ్యాయి. వాటికి నయనతార బదులిస్తూ నేను సాధారణ అమ్మాయినే. ఇతరుల మాదిరిగానే నాకు ఆశలు, ఆగ్రహాలు కలుగుతాయి. సరాసరి మనిషిలో ఉండే భావోద్రేకాలకు నేను అతీతురాలిని కాదు అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement