కమల్‌–సల్మాన్‌–ఓ సినిమా | kamal haasan and salman khan join hands with atlee for indias biggest action film | Sakshi
Sakshi News home page

కమల్‌–సల్మాన్‌–ఓ సినిమా

Published Wed, Jul 3 2024 12:17 AM | Last Updated on Wed, Jul 3 2024 9:32 AM

kamal haasan and salman khan join hands with atlee for indias biggest action film

హిందీలో షారుక్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ తీసి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ‘జవాన్‌’ సినిమా బాక్సాఫీస్‌ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.

కాగా అట్లీ ఓ మల్టీస్టారర్‌ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్‌ ప్లేస్‌లో కమల్‌హాసన్‌ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్‌–కమల్‌ కాంబినేషన్‌లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్‌ పిక్చర్స్‌ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement