Shah Rukh Khan Atlee Movie Titled As 'Jawan', Watch Video - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: జవాన్‌ మూవీ.. మాస్‌ లుక్‌లో షారుక్‌ ఖాన్‌

Published Fri, Jun 3 2022 2:43 PM | Last Updated on Fri, Jun 3 2022 3:19 PM

Shah Rukh Khan, Atlee Movie Titled As Jawan, Watch Video - Sakshi

ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో (2018) మూవీ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆడలేదు. దీంతో నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేందుకు చాలా సమయమే తీసుకున్నాడు షారుక్‌ ఖాన్‌. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షారుక్‌ సిద్దార్థ్‌ ఆనంద్‌తో పటాన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రాజ్‌కుమార్‌ హిరానీతో డంకీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమా అధికారికంగా ప్రకటించాడు హీరో. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీతో యాక్షన్‌ మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు.

శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ను వెల్లడిస్తూ మోషన్‌ పోస్టర్‌ వదిలాడు. ఇందులో గాయాలపాలైన షారుక్‌ ముఖానికి ఓ బట్ట కట్టుకుని చేతిలో గన్‌తో మాస్‌ లుక్‌లో కనిపించాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్‌ 2న రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. జవాన్‌ మూవీ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు. కాగా షారుక్‌  మాధవన్‌ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’, రణ్‌బీర్‌ కపూర్‌ ‘బ్రహ్మస్త్ర’ చిత్రాల్లో అతిథిగా వెండితెరపై కనిపించనున్నాడు.

చదవండి: సందీప్‌ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంది: మేజర్‌ సందీప్‌ తండ్రి
'విక్రమ్‌' మూవీపై నెటిజన్స్‌ టాక్‌ ఎలా ఉందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement