
రాజా రాణి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు అట్లీ.. తేరి, మెర్సెల్ లాంటి చిత్రాలతో ఘన విజయాలు నమోదు చేశాడు. సినిమా సినిమాకు సక్సెస్ రేట్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లను పెంచుకుంటూ పోతూ ఉన్న ఈ దర్శకుడు ముచ్చటగా మూడో సారి విజయ్‌తో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
విజయ్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో మహిళను వేధించాడని డైరెక్టర్ అట్లీపై వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలను పట్టించుకోకండంటూ.. మీరు థియేటర్స్‌లో పండుగ చేసుకునేలా సినిమా రావాలని ఎంతో కష్టపడి 70 రోజుల నుంచి నిరంతరాయంగా షూట్ చేస్తున్నామని చిత్రయూనిట్‌లోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్‌లోకి ఎంటరవుతున్నామని అన్నారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ను సరైన సమయంలో చెబుతామని అంత వరకు అభిమానులంతా ప్రశాంతంగా ఉండాలని, రూమర్స్‌ను పట్టించుకోవద్దని కోరారు.
70 days of continuous shoot, entering into the 4th schedule. And all the hard work are for the fans to celebrate in theatres. Updates & Announcements will be on right time and request fans to stay cool & avoid the rumours till then #IgnoreNegativity #Thalapathy63 pic.twitter.com/wtFKqeuEy0
— Jagadish (@Jagadishbliss) May 3, 2019
Comments
Please login to add a commentAdd a comment