అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి! Allu Arjun has turned down the highly anticipated film with Atlee, and Salman Khan is set to replace him. Sakshi
Sakshi News home page

బన్నీ మూవీలో సల్మాన్.. అట్లీ అందుకే తప్పుకొన్నాడా?

Published Tue, Jun 18 2024 7:52 AM | Last Updated on Tue, Jun 18 2024 9:15 AM

Atlee New Movie With Salman Khan After Allu Arjun Rejected

దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్‌, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్‌ మురుగదాస్‌.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్‌'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్‌పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్‌ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

అల్లు అర్జున్‌తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement