
ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి మైఖేల్ టైటిల్‌ను చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తెరి, మెర్శల్ చిత్రాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో తాజాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇది విజయ్‌కు 63వ చిత్రం. నయనతార నాయకిగా నటిస్తోంది. విల్లు చిత్రం ఈ జంట హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇదే. కదిర్, వివేక్, యోగి బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ఇందులో విజయ్ ఫుట్‌బాల్ క్రీడ శిక్షకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది.
చిత్రంలో ఆయన పేరు మైఖేల్ అని సమాచారం. హీరో పేర్లతో ఇంతకు ముందు చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో విజయ్ 63వ చిత్రానికి కూడా మైఖేల్ పేరును చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment