
బాలీవుడ్ భామ కియారా అద్వానీ కెరీర్ గ్రాఫ్ చూస్తే మూడు పువ్వులు ఆరు కాయలు అన్నంత బ్రహ్మాండంగా ఉంది. ‘యం.యస్. ధోని’ బయోపిక్‌లో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్, బోయపాటి చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్ స్టోరీస్’తో డిజిటల్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు.
కియారా నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం హిందీలో కరణ్ జోహర్ ప్రొడక్షన్‌లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న ‘గుడ్ న్యూస్’లో కీలక పాత్ర పోషిస్తున్నారామె. వీటితో పాటు లేటెస్ట్‌గా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌గా కియారా పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. తేరి, మెర్సల్ వంటి రెండు అద్భుత విజయాలను హీరో విజయ్‌కి ఇచ్చిన దర్శకుడు అట్లీ. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా తమిళంలోకి ఎంటర్ అయ్యే అవకాశం అంటే కియారాకి మంచి అవకాశమే. సో.. కియారా.. లక్కీయారా అనొచ్చేమో.
Comments
Please login to add a commentAdd a comment