
సినిమా: కోలీవుడ్ ఆఫర్ల కోసం బాలీవుడ్ బ్యూటీస్ సహా పలు భాషలకు చెందిన వారు ఆసక్తి చూపుతారన్నది వాస్తవం. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగారు. తాజాగా నటి కియారాను కోలీవుడ్‌కు దిగుమతి చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ అమ్మడు ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా తాజాగా తమిళంలో విజయ్ సరసన నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి నయనతార నాయకిగా నటిస్తోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించారు. విజయ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. పీవీ.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విజయ్‌తో రొమాన్స్ చేసే నాయకి ఎవరన్న విషయం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నటి త్రిష, క్రేజీ నటి రష్మిక పేర్లు కూడా ప్రచారంలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా బాలీవుడ్ బ్యూటీ కియారా పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కాల్‌షీట్స్ సెట్ అయితే, మరే చిత్రంలోనూ నటించకపోతే విజయ్‌తో రొమాన్స్ చేయడానికి కమిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment