బాలీవుడ్‌లో పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ఒకరు కియారా అద్వానీ. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి సైతం పరిచయమై ఇక్కడ కూడా టాప్ హీరోయిన్ రేస్‌లో నిలిచింది. అయితే ఆమె దిల్ ఖుష్ అయ్యే కబురు అందుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. అంతగా ఆమె మనసుని ఆనందపెట్టే విషయం ఏంటంటే... ‘దిల్’ రాజు బేనర్‌లో ఆమెకు రెండో అవకాశం దక్కిందట.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న భారీ ప్యాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న చిత్రంలోనూ కియారాని కథానాయికగా అనుకుంటున్నారట. ఈ వార్త నిజమైతే ఒకే బేనర్‌లో ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు దక్కించుకున్న ఆనందం ఈ బ్యూటీకి దక్కుతుందని చెప్పొచ్చు.
చదవండి: బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు
Comments
Please login to add a commentAdd a comment