స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌ | Nayanthara roped in for Vijay's next with Atlee | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌

Published Tue, Nov 27 2018 4:14 AM | Last Updated on Tue, Nov 27 2018 4:14 AM

Nayanthara roped in for Vijay's next with Atlee - Sakshi

నయనతార

ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తవుతున్నా కథానాయిక నయనతార జోరు ఏమాత్రం తగ్గడంలేదు. లేడీ సూపర్‌స్టార్‌గా ఆమెకున్న క్రేజ్‌ కూడా పెరుగుతూనే ఉంది. ఇటీవలే అజిత్‌ ‘విశ్వాసం’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి, ‘సైరా: నరసింహారెడ్డి, ఐరా, లవ్‌ యాక్షన్‌ డ్రామా’ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తాజాగా మరో సినిమాకు సై అన్నారు. తమిళ నటుడు విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకున్నారు.

‘‘కథలో హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఈ స్మార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌ రోల్‌ కోసం నయనతారను కథానాయికగా ఎంపిక చేసుకున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో స్టార్ట్‌ కానుందని సమాచారం. విజయ్‌– అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరీ, మెర్సెల్‌’ చిత్రాలు హిట్‌ సాధించడంతో తాజా చిత్రంపై అంచనాలున్నాయి. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement