Jawan Movie: Zinda Banda Song Making Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jawan: దుమ్ము రేపుతున్న ‘జవాన్‌’ మేకింగ్‌ వీడియో

Published Sun, Aug 13 2023 8:39 AM | Last Updated on Sun, Aug 13 2023 3:09 PM

Jawan Movie: Zinda Banda Song Making Video Goes Viral - Sakshi

 పటాన్‌ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇప్పుడు జవాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్‌ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్‌స్టార్‌ నయనతార బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.

ప్రతి నాయకుడుగా విజయ్‌ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్‌ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది.

కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్‌ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్‌ ఖాన్‌కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు.

ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్‌ ఖాన్‌తో కలిసి స్టెప్స్‌ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో జవాన్‌ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement